Site icon OkTelugu

Puri Jagannadh: పూరి చేసిన ఈ ఒక్క సినిమానే ఆయనకి శాపం లా మారిందా..?

Puri Jagannadh

Puri Jagannadh

Puri Jagannadh: ఒకప్పుడు తెలుగు సినిమా హీరోలందరూ రాముడు మంచి బాలుడు అనే మూస ధోరణి లో సినిమాలు చేసుకుంటూ వెళుతున్న క్రమంలో హీరో అంటే ఒక వెదవ, ఇడియట్, ఒక ఆవారా గాడు అంటూ అలాంటి క్యారెక్టర్లను రాసుకొని అలాంటి పాత్రలతో కూడా హిట్టు కొట్టి చూపించొచ్చు అని తెలియజేసిన ఏకైక దర్శకుడు పూరి జగన్నాథ్…

ఈయన మొదట గా పవన్ కళ్యాణ్ తో బద్రి అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత జగపతిబాబుతో చేసిన బాచి సినిమా అంత పెద్ద సక్సెస్ ని సాధించలేదు. ఇక ఆ తర్వాత రవితేజతో చేసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేసిన సినిమాలకు క్రేజ్ పెరగడమే కాకుండా ఆయన పేరు కు కూడా మంచి గుర్తింపు వచ్చింది.

ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ పోకిరి సినిమాతో ఒక్కసారిగా తన స్టార్ డమ్ ను తారాస్థాయికి పెంచేశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన హైప్ ని పెంచడంలో ఈ సినిమాలు చాలావరకు హెల్ప్ అయ్యాయి. ఇక ఆయన స్టార్ డమ్ ని ఒక్కసారి పాతాళానికి పడేసిన సినిమాల్లో ఆంధ్రావాలా, 143, ఇద్దరమ్మాయిలతో, జ్యోతిలక్ష్మి, లోఫర్, లైగర్ లాంటి సినిమాలు ఆయన కెరియర్ లోనే భారీ డిజాస్టర్లు గా మిగిలాయి. ఇక ఈ సినిమాల వల్లే ఆయన తన లైఫ్ లో చాలా వరకు డిస్సాపాయింట్ మూడ్ ని మెయింటైన్ చేశాడు.

అయినప్పటికీ తనను తాను మళ్ళీ రీ జనరేట్ చేసుకొని సక్సెస్ లు సాధించడమే లక్ష్యంగా ముందుకు కదలుతున్నాడు. ఇంతకుముందు సూపర్ హిట్ సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క స్టార్ హీరోలతో తను సక్సెస్ ఫుల్ సినిమాలను చేశాడు. ఆయన సినిమాల వల్లే ఆ హీరోలు అంత గొప్ప క్రేజ్ ను కూడా సంపాదించుకున్నారనే చెప్పాలి…

Exit mobile version