Dragon: ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ కాంబోలో చేస్తున్న డ్రాగన్ కథలో భారీ ట్విస్ట్…ఇదేందయ్యా ఇది… మనమెప్పుడు చూడాలా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు ఒక భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు..

Written By: Gopi, Updated On : October 31, 2024 4:26 pm

Prashant Neel is taking special care for NTR's characterization in Dragon...

Follow us on

Dragon: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక అలాగే తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోల్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారు కూడా ఒకరు కావడం విశేషం…ఇక ఇప్పటికే ఆయన నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్ళలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు మొదటి స్థానంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ నందమూరి ఫ్యామిలీ భారాన్ని మోస్తూ వస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. అలాగే భారీ కలెక్షన్స్ ని కూడా రాబట్టడంలో ఈ సినిమా చాలావరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే బాలీవుడ్ లో ఆయనకు భారీ క్రేజ్ అయితే పెరుగుతుంది. అలాగే ఆ తర్వాత చేయబోయే ప్రశాంత్ నీల్ సినిమా మీద కూడా బాలీవుడ్ లో భారీ బజ్ క్రియేట్ అవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న డ్రాగన్ సినిమా మీద పలు రకాల ఆసక్తికరమైన కామెంట్లైతే వెలువడుతున్నాయ. నిజానికి ఈ సినిమాని ప్రశాంత్ నీల్ వేరే హీరోతో చేయాలనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల మధ్యలోకి ఎన్టీఆర్ రావడంతో ఆయనతో ఈ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక భారీ ట్విస్ట్ అనేది ఎలివేట్ విధంగా కథను రాసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా సినిమా ఎండింగ్ లో ఈ ట్విస్ట్ అనేది ఉంటుందట. అయితే ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాలోని ట్విస్ట్ ప్రేక్షకులందరిని థ్రిల్ చేయబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి…అయితే ఈ సినిమా చివర్లో పిచ్చెక్కించే ట్విస్ట్ కి ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అవ్వడం పక్క అంటూ ప్రశాంత్ నీల్ టీం నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు మనం ఏ తెలుగు సినిమా లో కూడా చూడని ఒక అరుదైన ట్విస్ట్ ను ఆయన ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నారట.

మరి దీంతో ఇక మీదట వచ్చే సినిమాలన్నీ కూడా ఇదే ఫార్మాట్లో కొనసాగబోతున్నాయి అనే ఒక కాన్ఫిడెంట్ ను కూడా ప్రశాంత్ నీల్ తెలియజేస్తున్నాడు. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమాతో భారీ పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…