Tollywood Star Heros : తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే చాలామంది స్టార్ హీరోలు గుర్తొస్తారు. ముఖ్యంగా ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇక వీళ్ళందరూ తమకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో భారీ సక్సెస్ లను సాధిస్తూ నెంబర్ వన్ హీరో గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకైతే ఈ హీరోలందరూ పాన్ ఇండియా హీరోలుగా వెలుగుందుతూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ లాంటి హీరో అటు రాజకీయాలు ఇటు సినిమా రెండింటిని సమపాళ్ళల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికీ మిగతా హీరోలందరూ సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేసి స్టార్లుగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మన హీరోలలో ఎవరు నెంబర్ వన్ హీరో అనే దానిమీద చాలా రోజుల నుంచి తీవ్రమైన చర్చలైతే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే హీరోలందరు వరుసగా సక్సెస్ లను సాధిస్తూ మంచి ఊపులో ఉన్నారు. కాబట్టి నెంబర్ వన్ హీరో ఎవరు అనేది చెప్పడం చాలా కష్టతరం అవుతుంది.
ఇక ఇప్పుడున్న వాళ్లందరిలో ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ కూడా కొట్టలేని హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే మిగిలిపోయాడు. మిగతా హీరోలందరు కూడా తమ తమ కెరియర్లలో ఒక్కసారైనా ఇండస్ట్రీ హిట్ ను సాధించి టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. మరి ఎన్టీఆర్ మాత్రం ఎందుకు ఇండస్ట్రీ హిట్ కొట్టలేకపోయాడు. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో నాలుగు సినిమాలు చేసినప్పటికీ అవి ఇండస్ట్రీ హిట్లుగా మాత్రం కన్వర్ట్ కాలేకపోయాయి.
కారణం ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే మాత్రం చాలా జెన్యూన్ స్టోరీ తో ఒక డిసెంట్ అటెంప్ట్ ఇస్తే తప్ప ఈ రోజుల్లో సినిమాలు ఇండస్ట్రీ హిట్టుగా కన్వర్ట్ కావడం లేదు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమాతో అయిన ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ కొడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…