Viral video : కోల్ కతా లో ప్రతి ఏడాది దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ తొమ్మిది రోజులపాటు కోల్ కతా నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతూ ఉంటుంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోల్ కతా లో ప్రత్యేకమైన వేడుకలు జరుగుతుంటాయి. అన్నదానాలు, కోలాటాలు, విచిత్ర వేషధారణలతో ప్రదర్శనలు కోల్ కతా లో కనిపిస్తుంటాయి. ఈ ఏడాది కూడా కోల్ కతా లో దుర్గామాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామాత ఉత్సవాలను కోల్ కతా వాసులు ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారు కొలువై ఉండే మండపాలను అత్యద్భుతంగా తీర్చి దిద్దుతారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు ప్రతిరోజు ఒక రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. కోల్ కతా లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జగత్ ముఖర్జీ పార్క్ వద్ద మెట్రో నమూనాతో నీటి అడుగున ఏర్పాటు చేసిన మండపం ఆకట్టుకుంటున్నది. కోల్ కతా మహానగరంలో మొట్టమొదటిసారిగా నీటి అడుగున మెట్రో నమూనాతో ఏర్పాటు చేసిన మండపం ఆకట్టుకుంటున్నది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది.
ప్రతిష్టాత్మకంగా..
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం.. విశాలమైన ఓ మెట్రో రైలు దర్శనమిస్తోంది. అందులో భక్తులు ముందుగా వెళ్తున్నారు. వారి కుడివైపున ఒక ద్వారం ఉంది. ఆదివారం తెచ్చుకోగానే నీటి అడుగున దుర్గామాత సెట్టింగ్ ఉంది. అందులో అమ్మవారు కొలువై ఉంది. అమ్మవారి ముఖం దీపాల వెలుగులో అత్యంత శోభాయమానంగా కనిపిస్తోంది. రంగురంగుల విద్యుత్ దీపాలు అమ్మవారికి మరింత వెలుగును తీసుకొస్తున్నాయి. ఆ మండపాన్ని అత్యంత అందంగా తీర్చిదిద్దారు. ఆ నీటిలో రకరకాల ఆకృతులను ఉంచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. 2021 లోనే కోల్ కతా లో నిర్వహించే దుర్గామాత పూజకు ఐక్యరాజ్యసమితి వారసత్వ హోదా లభించింది. దుర్గామాత పూజ మానవ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకుంది.
విశేషమైన నైవేద్యాలు..
దుర్గామాత ఉత్సవాల సమయంలో కోల్ కతా వాసులు అమ్మవారికి విశేషమైన పూజలు చేస్తారు. నైవేద్యాలు కూడా విభిన్నంగా సమర్పిస్తారు. పాలు, బెల్లం, యాలకులు, కుంకుమపువ్వు మిశ్రమం, అటుకులు, గోధుమ రవ్వతో నైవేద్యం చేసి అమ్మవారికి నివేదిస్తారు.. దుర్గామాత ఉత్సవాల్లో ఈ నైవేద్యానికి విశేషమైన ప్రాధాన్యం ఉంటుంది. పాయసం, పచ్చి మొక్కజొన్నలు, వెల్లుల్లి, కారం, ఉప్పు మిశ్రమంతో వడలు తయారుచేసి అమ్మవారికి పెడతారు. ఇలా పెడితే తామ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తుంటారు.