Koratala Shiva : దేవర’ చిత్రం విజయం కొరటాలకు అసలు ఉపయోగపడలేదా..? ఆయన పేరు ఎత్తితేనే పారిపోతున్న హీరోలు!

దేవర' సినిమా సక్సెస్ అయ్యింది కదా, ఇక కొరటాల శివ టైం మళ్ళీ మొదలైనట్టే, ఇక మళ్ళీ ఆయన టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా దూసుకొని పోతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పరిస్థితి ఏమి మారలేదు. 'ఆచార్య' సమయంలో ఎలా ఉందో, ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. దేవర చిత్రం కేవలం ఎన్టీఆర్ వల్ల మాత్రమే హిట్ అయ్యిందని ట్రేడ్ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు.

Written By: Vicky, Updated On : October 9, 2024 7:14 pm

Koratala Shiva

Follow us on

Koratala Shiva :  ఆచార్య వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇంతకంటే చెత్త సినిమా ఎవ్వరూ తీయలేరు, దర్శకత్వం మీద పట్టు తగ్గినప్పుడే ఇలాంటి సినిమాలు వస్తుంటాయి, మళ్ళీ కోలుకోవడం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన ‘దేవర’ చిత్రం విడుదలై మంచి హిట్ అయ్యింది. కానీ సినిమాకి టాక్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఫ్యాన్స్ షోస్ నుండి యావరేజ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ, సెకండ్ హాఫ్ బాగాలేదు అనే టాక్ జనాల్లో బలంగా వెళ్ళింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి కనెక్ట్ అవ్వడంతో ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ కూడా వచ్చింది. కానీ ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం లో కొరటాల పాత్ర చాలా తక్కువే అని చెప్పాలి.

ఎన్టీఆర్ అద్భుతమైన నటన, అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని పైకి లేపింది. ముఖ్యంగా కొన్ని కీలకమైన బ్లాక్స్ కి అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఆడియన్స్ పదే పదే థియేటర్స్ కి వెళ్తున్నారు. అలాంటి థియేట్రికల్ అనుభూతిని అందించింది ఈ చిత్రం. అయితే ‘దేవర’ సినిమా సక్సెస్ అయ్యింది కదా, ఇక కొరటాల శివ టైం మళ్ళీ మొదలైనట్టే, ఇక మళ్ళీ ఆయన టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా దూసుకొని పోతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన పరిస్థితి ఏమి మారలేదు. ‘ఆచార్య’ సమయంలో ఎలా ఉందో, ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. దేవర చిత్రం కేవలం ఎన్టీఆర్ వల్ల మాత్రమే హిట్ అయ్యిందని ట్రేడ్ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆ చిత్రం కొరటాల శివ కి పెద్దగా ఉపయోగపడలేదని అంటున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో ‘దేవర 2’ తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. ‘దేవర 2’ అసలు నిజంగా ఉంటుందా లేదా అనే విషయం పై ఇంకా క్లారిటీ నే రాలేదు. ఎన్టీఆర్ ఉంటుంది అని అన్నాడు కానీ, కార్యరూపం దాల్చడం కష్టమే. మరోపక్క అల్లు అర్జున్ తో ఒక సినిమాని ప్రకటించి చాలా ఏళ్ళు అయ్యింది.

ఈ ప్రాజెక్ట్ కూడా అట్టకెక్కినట్టే. ఇక ఆ తర్వాత ప్రభాస్ కాల్ షీట్స్ రాబోయే మూడేళ్ళ వరకు ఫుల్, ఆయన కొరటాల కి డేట్స్ ఇచ్చే అవకాశమే లేదు. అలాగే కొరటాలకు అత్యంత సన్నిహిత హీరోలలో ఒకరైన మహేష్ బాబు ని రాజమౌళి ఎప్పుడు వదులుతాడో ఎవరికీ క్లారిటీ లేదు, కాబట్టి ఆయన డేట్స్ కూడా కష్టమే. ఇక రామ్ చరణ్ 20 వ సినిమా వరకు కాంబినేషన్స్ సెట్ అయ్యాయి, ఆయన కూడా డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర 2’ కి ఇవ్వాలి, లేదంటే మీడియం రేంజ్ హీరోతో కొరటాల సినిమా చేసుకోవాలి, వాళ్ళు అయినా అవకాశం ఇస్తారా అంటే అనుమానమే, చూడాలి మరి కొరటాల శివ పయనం ఎటు వైపు వెళ్తుందో అనేది.