https://oktelugu.com/

Nani: అదే జరిగితే ‘నాని’ స్థాయి సగం పడిపోయినట్టే !

Nani: నాని న్యాచురల్ స్టార్ అని ఎప్పుడైతే ఒక బిరుదు తగిలించుకున్నాడో.. అప్పటి నుంచి నానికి అసలు టైం కలిసి రావడం లేదు. అయినా, ఒకటి రెండు హిట్లు వచ్చాయని స్టార్ అని తగిలించుకోవడం అంత మంచి పద్దతి కాదు. ఇప్పటికే నాని ఖాతలో వరుసగా ఐదు కమర్షియల్ ప్లాప్ లు పడ్డాయి. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ అనే సినిమా వస్తోంది. అయితే, ఈ సినిమాతో నైనా తన జాతకం మారుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నాని. […]

Written By:
  • Shiva
  • , Updated On : December 21, 2021 / 01:38 PM IST
    Follow us on

    Nani: నాని న్యాచురల్ స్టార్ అని ఎప్పుడైతే ఒక బిరుదు తగిలించుకున్నాడో.. అప్పటి నుంచి నానికి అసలు టైం కలిసి రావడం లేదు. అయినా, ఒకటి రెండు హిట్లు వచ్చాయని స్టార్ అని తగిలించుకోవడం అంత మంచి పద్దతి కాదు. ఇప్పటికే నాని ఖాతలో వరుసగా ఐదు కమర్షియల్ ప్లాప్ లు పడ్డాయి. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ అనే సినిమా వస్తోంది. అయితే, ఈ సినిమాతో నైనా తన జాతకం మారుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నాని.

    Nani

    కానీ జాతకం మారేలా లేదు. స్టార్ గా ఇక నాని నిలబడటం కష్టమే అని అంటున్నారు ఇండస్ట్రీలో. ఈ సినిమా పై బయ్యర్లు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. దాంతో నిర్మాత నష్టాలకు బయ్యర్లకు సినిమాను ఇచ్చారు. కలెక్షన్స్ వచ్చాక, బయ్యర్లకు లాభాలు వస్తే.. ఆ తర్వాత నిర్మాతకు డబ్బులు వస్తాయి. ఒకవేళ సినిమాకి హిట్ టాక్ రాకపోయినా ముందుగా నష్టపోయేది నిర్మాతనే.

    ఒకవేళ నిర్మాత గానీ నష్టపోతే.. నాని మార్కెట్ సగం తగ్గిపోతుంది. అప్పుడు రెమ్యునరేషన్ కూడా సగానికి పడిపోతుంది. అదే జరిగితే మీడియం రేంజ్ హీరోల లిస్ట్ నుంచి నాని తప్పుకోవాల్సి వస్తోంది. ఏ రకంగా చూసుకున్నా.. ఇప్పుడు నాని భవిష్యత్తు మొత్తం శ్యామ్ సింగరాయ్ పైనే ఆధారపడి ఉంది. నిజానికి గతంలో నాని నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా ఆ సినిమా పై అంచనాలు బాగా క్రియేట్ అయ్యేవి.

    బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆ సినిమాకు తమ వంతు సహాయ సహకారాలు అంధించడమికి తెగ ఉత్సాహం చూపించేవారు. కానీ, ఇప్పుడు నాని తాపత్రయ పడుతున్నాడు గానీ, ఎవ్వరు నాని సినిమాని పట్టించుకునే పరిస్థితిలో లేరు. తన పై మార్కెట్ అయ్యేలా లేదు అని, చివరకు నాని సాయి పల్లవి పేరును వాడుకోవాల్సి వస్తోంది,

    Also Read: Chiranjeevi: ప్చ్ ఆయన మాటలు చిరంజీవిని బాధ పెట్టాయి

    అయినా, ఎందుకో శ్యామ్ సింగరాయ్ పై ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. కాస్టింగ్ తో సంబంధం లేకుండా మొదటి రోజు సినిమా చూసే ప్రేక్షకులు కూడా.. నాని చిత్రాన్ని పక్కన పెట్టేశారు. అసలుకే ఇది కరోనా కాలం. చిన్నగా కలెక్షన్స్ వస్తాయిలే అని సర్దిచెప్పుకోడానికి లేదు. ఓపెనింగ్స్ వస్తేనే సినిమా నిలబడుతుంది. లేదంటే.. ఇక కష్టమే.

    Also Read: Naga Chaitanya: సామ్ దూరమయ్యాక చైతులో ఈ మార్పు మంచిదే !

    Tags