Director Heroine Combination: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్స్ కి,కొంత మంది డైరెక్టర్స్ కి మధ్య మంచి కాంబినేషన్ లు కుదిరి మంచి సినిమాలు వచ్చాయి. ఆ హీరోయిన్లు ఆ డైరెక్టర్ల కాంబినేషన్ లోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అలా బెస్ట్ హీరోయిన్ డైరెక్టర్ కాంబినేషన్ ఏది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
సంపత్ నంది తమన్నా
ఏమైంది ఈవేళ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన సంపత్ నంది.తన సెకండ్ సినిమా గా రామ్ చరణ్ హీరోగా రచ్చ అనే సినిమా తీశాడు. ఈ సినిమా లో హీరోయిన్ గా తమన్నా నటించింది.ఇక అక్కడి నుండి సంపత్ నంది కి తమన్నా కి మధ్య మంచి కంఫర్ట్ లెవెల్ అనేది ఉండటం తో సంపత్ నంది ఆ తర్వాత తను చేసిన బెంగాల్ టైగర్, సిటీ మార్ సినిమాల్లో కూడా తమన్నానే హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. అలా వీళ్ళిద్దరి కాంబోలో మంచి సినిమాలు రావడంతో పాటు ఈ కాంబోకి కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ పెరిగింది…
వెంకీ కుడుముల రష్మిక మందాన
ఛలో సినిమాతో వెంకీ కొడుకుల డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఇక అదే సినిమాకి హీరోయిన్ గా రష్మిక మందానని తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేయడం జరిగింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ డైరెక్టర్ నితిన్ తో చేసిన భీష్మ సినిమా లో కూడా రష్మీక ని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది.అలా వీళ్ళ కాంబోకి మంచి క్రేజ్ పెరిగింది… ప్రస్తుతం నితిన్ తో వెంకీ కుడుముల చేస్తున్న సినిమాలో కూడా తనే హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా వరుసగా వెంకీ తన మూడు సినిమాల్లో రష్మిక నే హీరోయిన్ గా పెట్టుకొని సినిమాలు చేస్తున్నాడు…
అనిల్ రావిపూడి మెహరీన్
పటాస్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన అనిల్ రావిపూడి ఆ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన ఊపు లో వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లు అందుకుంటూ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కూడా కొనసాగుతున్నాడు. ఇక అనిల్ రావిపూడి మెహరీన్ మధ్య మంచి బాండింగ్ ఉండడంతో వీళ్లిద్దరి మధ్య ఎక్కువ సినిమాలు రావడం జరిగింది.రవితేజ హీరోగా వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాలో మెహిరిన్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆ తర్వాత సినిమాల్లో కూడా తనకి హీరోయిన్ గా ఛాన్స్ లు ఇవ్వడం జరిగింది. F3 సినిమాలో కూడా తనే హీరోయిన్ గా నటించడం జరిగింది. ఇలా వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండడంతో వీళ్ళ కాంబో లోనే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి…