https://oktelugu.com/

Rachin Ravindra: కుర్ర ప్లేయర్ విధ్వంసం ముందు చేతులు ఎత్తేసిన ఇంగ్లాండ్ టీమ్…

వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మీద న్యూజిలాండ్ భారీ విజయాన్ని అందుకుంది. ఇంతకుముందు ఇంగ్లాండ్ మీద ఉన్న రివెంజ్ ని ఇప్పుడు న్యూజిలాండ్ తీర్చుకోవడం జరిగింది.

Written By:
  • Gopi
  • , Updated On : October 6, 2023 / 10:14 AM IST

    India Vs New Zealand Semi Final

    Follow us on

    Rachin Ravindra: క్రికెట్ అనేది ఒక మనిషిని చాలావరకు ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు వేరే వర్క్ ఏదీ చేయలేరు. ఎందుకంటే క్రికెట్ అనేది ఒక ఇండిపెండెంట్ గేమ్ అది స్వతంత్ర్యం గా ఆడుతూ వాళ్లకు వాళ్ళు గొప్ప అనుభూతిని చెందారు.అంతే తప్ప అది కూర్చొని ఆడేదో లేకపోతే ఇంకొటో కాదు అందుకోసమే క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది.మరికొందరు అయితే అదే ప్రాణంగా కూడా బతుకుతూ ఉంటారు.

    అయితే వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మీద న్యూజిలాండ్ భారీ విజయాన్ని అందుకుంది. ఇంతకుముందు ఇంగ్లాండ్ మీద ఉన్న రివెంజ్ ని ఇప్పుడు న్యూజిలాండ్ తీర్చుకోవడం జరిగింది. అయితే నిన్నటి మ్యాచ్ లో డేవిన్ కాన్వే 152 పరుగులు చేయగా రచిన్ రవీంద్ర 123 పరుగులు చేశాడు.ఇక మొదటి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ కు చెందిన ఇద్దరు ప్లేయర్లు సెంచరీలు సాధించారు… ఇక డెవిన్ కాన్వే అంటే మనం ఇంతకుముందు ఆయన ఆటని చాలాసార్లు చూశాం.ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ టీం తరఫున అద్భుతమైన రన్స్ చేశాడు. అయితే ఇంకో ప్లేయర్ అయిన రచిన్ రవీంద్ర…

    ఎవరు ఈ రవీంద్ర నిన్నటి నుంచి ఒకటే చర్చ జరుగుతుంది అంటూ చాలా మంది ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. న్యూజిలాండ్ టీం లో ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న ఈ యంగ్ ప్లేయర్ ఎవరు అనేదానిమీద చాలామంది ఆయన గురించి తెలుసుకోవాలని అసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక అందులో భాగంగానే ఆయన ఎవరు అనే విషయాలను కూడా మనం ఒకసారి తెలుసుకుందాం…

    ఇండియాక లోని కర్ణాటక రాష్ట్రానికి చెందిన రవి కృష్ణమూర్తి, దీపా కృష్ణమూర్తి అనే దంపతులు 1990వ సంవత్సరంలో న్యూజిలాండ్ కి వెళ్లి అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది .ఇక ఈ దంపతులకు 1999వ సంవత్సరంలో ఒక బాబు జన్మించడం జరిగింది. స్వతహాగా కృష్ణమూర్తికి క్రికెట్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల రాహుల్ ద్రావిడ్ లోని మొదటి అక్షరమైన ‘రా’అనే ఒక అక్షరాన్ని కలుపుతూ అలాగే సచిన్ లోని చివరి రెండు అక్షరాలైన చిన్ రెండింటినీ కలిపి ఆయనకి రచిన్ రవీంద్ర అనే పేరును పెట్టడం జరిగింది. రచిన్ రవీంద్ర అనే ప్లేయర్ భారతీయ సంతతికి చెందిన ప్లేయర్ కావడం నిజంగా భారతీయులందరూ గర్వపడాల్సిన విషయమనే చెప్పాలి. ఎందుకంటే భారతదేశ సంతతికి చెందిన ఒక యంగ్ ప్లేయర్ న్యూజిలాండ్ టీం తరఫున ఆడుతూ అక్కడ అద్భుతాలను క్రియేట్ చేస్తున్నాడు అంటే ఒకరకంగా దానికి మన ఇండియన్స్ కూడా గర్వపడాలనే చెప్పాలి… నిన్నటి మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ చేసి ప్రపంచంలోని అభిమాని దృష్టిని ఆకర్షించిన రచిన్ రవీంద్ర గురించి గూగుల్ లో విపరీతమైన చర్చ చేయడం జరుగుతుంది. అయితే అతను భారతీయ సంతితి కి చెందిన వాడు అని తెలిసిన ప్రతి ఒక్క ఇండియన్ అభిమాని గర్వపడుతున్నాడు….