Swarnakamalam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన వాళ్లలో విక్టరీ వెంకటేష్ ఒకరు. అప్పట్లో ఆయన వరుస సినిమాలు చేస్తూ విక్టరీ అనే ఒక బ్రాండ్ నేమ్ ను సంపాదించుకున్నాడు. అలాంటి వెంకీ అప్పట్లో అన్ని జానర్లలలో సినిమాలు చేస్తూ యూనివర్సల్ హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక అందులో భాగం భాగంగానే కె విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన స్వర్ణకమలం సినిమాలో నటించి నటుడు గా మరో మెట్టు పైకి ఎదిగారనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో విశ్వనాథ్ గారు మొదటగా ఈ సినిమాకి వెంకటేష్ ని హీరోగా అనుకోలేదట ఈ సినిమాకి మొదటి ఛాన్స్ గా కె.విశ్వనాథ్ గారు కమలహాసన్ ని తీసుకుందాం అని అనుకున్నాడు కానీ వెంకటేష్ వాళ్ళ నాన్న అయిన డి రామానాయుడు విశ్వనాథ్ గారితో ఏదైనా ఒక స్టోరీ ఉంటే మా అబ్బాయి తో చేయండి అని చెప్పడంతో అప్పటికప్పుడు స్వర్ణకమలం సినిమాని కమలహాసన్ తో చేయాల్సింది కానీ రామానాయుడు లాంటి ప్రొడ్యూసర్ అడగటం తో స్వర్ణ కమలం సినిమా స్టోరీ ని నాయుడు గారికి, వెంకీ కి చెప్పి ఆ కాంబినేషన్ లో విశ్వనాథ్ సినిమా సెట్ చేశాడు. అయితే విశ్వనాధ్ గారికి ఒకటే డౌట్ ఉండేది అమెరికా నుంచి వచ్చి స్టైలిష్ గా ఉండే సినిమాలు తీసుకుంటూ వస్తున్న వెంకటేష్ లాంటి ఒక యంగ్ హీరో ఇలాంటి ఆర్ట్ మూవీలో చేయగలడా లేదా అనే సందేహం అయితే ఆయనకు మొదటి నుంచి ఉంది…
ఇక అందులో భాగంగానే ఫస్ట్ రోజు షూటింగ్ లో విశ్వనాథ్ గారు చెప్పిన కొన్ని సీన్స్ ని వెంకటేష్ అంత పర్ఫెక్ట్ గా డెలివరీ చేయలేకపోయాడు.దాంతో విశ్వనాధ్ ఈ సినిమాకి వెంకటేష్ కరెక్ట్ ఆప్షన్ అవునా కాదా అని తేల్చుకునే పనిలో పడ్డాడు. దాంతో నెక్స్ట్ డే షూటింగ్ కి వచ్చిన వెంకటేష్ విశ్వనాథ్ గారితో మీరు ఏ సీన్ అయిన పర్లేదు క్లియర్ గా చెప్పండి నేను నా వంతు ఎఫర్ట్ పెట్టి యాక్టింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను షాట్ ఒకే అవ్వకపోతే చెప్పండి మళ్ళీ చేయడానికి కూడా నేను రెఢీ గా ఉన్నాను అని చెప్పాడు.
దాంతో వెంకటేష్ డెడికేషన్ కి మురిసిపోయిన విశ్వనాథ్ ఈ మాత్రం డెడికేషన్ ఉంటే చాలు ఆ క్యారెక్టర్ లో ఈజీగా చేయగలడు అనే ఒక నమ్మకం తనలో కలిగి ప్రతిదీ వెంకటేష్ కి చెప్పి చేయించుకున్నాడు. అందువల్లే ఇంతకుముందు వచ్చిన సినిమాలకి ఆ సినిమాకి వెంకటేష్ యాక్టింగ్ లో తేడా చాలా స్పష్టం గా కనిపిస్తుంది. ముఖ్యంగా కె విశ్వనాథ్ సినిమా అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా ఉంటుంది కాబట్టి ఆయన సినిమాల్లో నటించడం అనేది ప్రతి హీరోకి ఒక కలలాంటిది. అందుకే ఆయన సినిమాలో వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదని వెంకీ విశ్వనాథ్ గారు ఎలా చెప్తే అలా చేయడానికి సిద్ధపడ్డాడు.
ఇక అందులో భాగంగానే ఆ సినిమా బాగా వచ్చింది.షూటింగ్ కంప్లీట్ అవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు తోందరగా ముగించి రిలీజ్ చేయడం తో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో వెంకటేష్ కి ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గా మంచి పేరు వచ్చింది అలాగే ఆయన క్రేజ్ కూడా బాగా పెరిగింది. అలా వెంకటేష్ విశ్వనాథ్ గారి కాంబినేషన్ లో వచ్చిన స్వర్ణకమలం సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడంతో ఒక పక్క వెంకటేష్ అటు విశ్వనాధ్ గారు చాలా హ్యాపీ గా ఫీలయ్యారు.అలాగే వెంకటేష్ వాళ్ళ ఫాదర్ అయిన రామానాయుడు కూడా తను విశ్వనాథ్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వెంకటేష్ కి అదిరిపోయే హిట్ ఇచ్చారని ఆయన విశ్వనాధ్ గారిని ప్రశంసించడం జరిగింది…