Star Heroes: సాధారణంగా కొన్ని సినిమాలకి మొదట సక్సెస్ టాక్ వచ్చి ఆ తర్వాత సూపర్ సక్సెస్ గా నిలుస్తూ ఉంటాయి. ఇక మరికొన్ని సినిమాలకి మొదట సక్సెస్ టాక్ వచ్చిన తర్వాత ఫ్లాపులుగా నిలుస్తూ ఉంటాయి. ఇక ఇంకొన్ని సినిమాలు మొదట నెగిటివ్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత సూపర్ హిట్లుగా నిలుస్తాయి.. ఇక మొత్తానికైతే ఫైనల్ గా సినిమా రిజల్ట్ ఏంటి అనేది మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి మొదట నెగిటివ్ టాక్ వచ్చి ఆ తర్వాత సూపర్ సక్సెస్ అయిన సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
నాన్నకు ప్రేమతో
2016 వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా సుకుమార్ తెలివికి నిదర్శనమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ సినిమాతో ఒక వండర్ ని క్రియేట్ చేశాడు. ఇక అంతకు ముందు చేసిన వన్ సినిమా జనాలకు అర్థం కాకపోవడంతో ఆ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమాను మాత్రం చాలా ఇంటలిజెంట్ గా తెరకెక్కించాడు. అయితే మొదట ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ సినిమాలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..
సరైనోడు
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమాకి మొదట నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఆ తర్వాత ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి సూపర్ సక్సెస్ గా నిలిచింది…
సన్నాఫ్ సత్యమూర్తి
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా మొదట త్రివిక్రమ్ స్టాండర్డ్ లో లేదనే విమర్శలైతే ఎదుర్కొంది. కానీ ఆ తర్వాత సూపర్ సక్సెస్ సాధించింది…
పుష్ప
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ వచ్చిన పుష్ప సినిమాకి మొదట నెగిటివ్ టాక్ వచ్చింది. మొదటి వారం మొత్తం ఈ సినిమా నెగిటివ్ టాక్ తో నడిచింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా సూపర్ సక్సెస్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగడంతో అన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది…
సర్కారు వారి పాట
పరుశురాం డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన సర్కార్ వారి పాట సినిమా కూడా మొదట మహేష్ లెవల్ కి సరిపడా కథ తో రాలేదు అనే టాకైతే వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది…