https://oktelugu.com/

Savitri: సావిత్రి జీవితంలో చేసిన తప్పులు ఇవే.. అందుకే ఆమె మోసపోయింది..

Savitri: సావిత్రి.. ఈ పేరు వింటే టాలీవుడ్ ప్రేక్షకులు కొన్ని పదుల సంవత్సరాలు వెనక్కి వెళతారు. తరానికి సంబంధం లేకుండా చాలా ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది సావిత్రి. తన అందం, అభినయంతో అందరికీ దగ్గరైంది. అప్పట్లో ఆమెతో యాక్ట్ చేసేందుకు పెద్ద పెద్ద హీరోలు సైతం ఎదురుచూసేవారట. ఇలా ఆమెకు సంబంధించిన విషయాలను ఇటీవలే బయటపెట్టింది ప్రియా చౌదరి. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సావిత్రి గారు చేసిన […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 24, 2022 / 12:15 PM IST
    Follow us on

    Savitri: సావిత్రి.. ఈ పేరు వింటే టాలీవుడ్ ప్రేక్షకులు కొన్ని పదుల సంవత్సరాలు వెనక్కి వెళతారు. తరానికి సంబంధం లేకుండా చాలా ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది సావిత్రి. తన అందం, అభినయంతో అందరికీ దగ్గరైంది. అప్పట్లో ఆమెతో యాక్ట్ చేసేందుకు పెద్ద పెద్ద హీరోలు సైతం ఎదురుచూసేవారట. ఇలా ఆమెకు సంబంధించిన విషయాలను ఇటీవలే బయటపెట్టింది ప్రియా చౌదరి. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సావిత్రి గారు చేసిన కొన్ని పొరపాట్లను వివరించింది. మూవీలో యాక్ట్ చేయాలంటే సావిత్రి తీసుకునే రెమ్యునరేషన్ చాలా ఎక్కువ. ఆమె తీసుకునే రెమ్యునరేషన్ దాదాపు హీరోతో సమానంగా ఉండేది అంటూ చెప్పుకొచ్చింది.

    Savitri

    ఆమె రెమ్యునరేషన్ కు సంబంధించిన డబ్బు ఆమె కార్లలో సంచుల్లో తీసుకుపోయేవారట. అంత క్రేజ్, ఇమేజ్ ఉన్న మహిళ ఎందుకు ఉన్నట్టుండి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుందో వివరించారు ప్రియా చౌదరి. ఆమె ఎప్పుడూ ఆత్మఅభిమానాన్ని కోరుకునే వారట. కానీ ఆమె సంపాదించిన సంపద పట్ల కాస్త అజాగ్రత్తగా ఉండేవారట. ఇవే ఆమెకు ఇబ్బందులను తెచ్చిపెట్టాయట. దీనికితోడు ఆమెను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది ఆమె పెదనాన్న.

    Also Read:  ట్రెండింగ్: అంతుచిక్కని సమంత వ్యవహారం..

    ఆమె యాక్టింగ్ చేస్తున్న సమయంలోనూ ఆమె, ఆమె రెమ్యునరేషన్‌పై ఆయన పెత్తనమే నడిచేదట. దీంతో ఎలాగైనా ఆ పంజరం నుంచి బయటపడాలని భావించింది. ఆయన డామినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు జెమిని గణేశ్ ను పెళ్లాడింది. ఇదే ఆమె చేసిన మరో తప్పు. ఆయన మాటలు మాత్రం స్త్రీలను ప్రోత్సహించేలా ఉండేవి. దానిని చూసి అట్రాక్ట్ అయిన సావిత్రి.. ఆయనను పెళ్లి చేసుకుంది.

    Savitri

    తర్వాత గణేశ్ సైతం డామినేషన్ చేయడం మొదలుపెట్టాడట. ఇక సావిత్రికి సంబంధించిన మరిన్ని విషయాలను వివరించారు ప్రియా చౌదరి. మరి జీవితంలో సావిత్రి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నదోననే విషయాలను తెలిపారు. సావిత్రి చిన్నప్పటి నుంచి ప్రతి విషయాన్ని చాలెంజింగ్‌గా తీసుకునేదట. అందుకే ఆమె సంపదను సైతం ఎక్కువగా లెక్కచేయలేదట. అందుకు ఆమె ఉన్నట్టుండి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది.

    Also Read: రజనీకాంత్ ‘శివాజీ’ మూవీలోని అక్కమ్మ-జక్కమ్మ సిస్టర్స్ బయట ఎంత అందగత్తెలో తెలుసా..

    Tags