https://oktelugu.com/

Bhimla Nayak: ‘భీమ్లా నాయక్’ నుంచి మరో క్రేజీ అప్ డేట్ రివీల్ !

Bhimla Nayak: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. కాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పవన్ ఫ్యాన్స్ కి వరుసగా అదిరిపోయే న్యూస్ చెబుతున్నాడు. తాజాగా మళ్ళీ భీమ్లా నాయక్ నుండి తదుపరి పాట గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చాడు థమన్. సింగర్ గీతా మాధురితో కలిసి థమన్ గత రాత్రి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ను నిర్వహించాడు. యాక్షన్ డ్రామా ‘భీమ్లా నాయక్’ నుండి రాబోయే నాలుగో పాట […]

Written By:
  • Shiva
  • , Updated On : January 24, 2022 / 12:38 PM IST
    Follow us on

    Bhimla Nayak: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘భీమ్లా నాయక్’. కాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పవన్ ఫ్యాన్స్ కి వరుసగా అదిరిపోయే న్యూస్ చెబుతున్నాడు. తాజాగా మళ్ళీ భీమ్లా నాయక్ నుండి తదుపరి పాట గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చాడు థమన్. సింగర్ గీతా మాధురితో కలిసి థమన్ గత రాత్రి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ను నిర్వహించాడు. యాక్షన్ డ్రామా ‘భీమ్లా నాయక్’ నుండి రాబోయే నాలుగో పాట సంచలనాత్మకంగా ఉంటుందని వెల్లడించాడు.

    Bheemla Nayak

    ఇది సింగిల్ మాస్ సాంగ్ కాదని, లాలీ తరహా పాట అని థమన్ చెప్పుకొచ్చాడు. అయితే, పాటల విడుదల తేదీకి సంబంధించి వారిద్దరూ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఇది నిన్న కూడా థమన్ ఒక అప్ డేట్ ఇస్తూ.. డైరెక్టర్ త్రివిక్రమ్‌ తో కలిసి తాను ఇటీవల భీమ్లానాయక్ రఫ్ ఫుటేజీని చూశానని, ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్ యాక్షన్ తనకు ఎంతో నచ్చిందని, ఆయన కెరీర్‌ లోనే ఇది ఉత్తమ చిత్రం అవుతుందని థమన్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

    Also Read:  ట్రెండింగ్: అంతుచిక్కని సమంత వ్యవహారం..

     

    Bhimla Nayak

    ఇక ఈ సినిమా కోసం బెస్ట్ మ్యూజిక్ అందించడానికి ప్రయత్నించానన్నాడు. అయ్యప్పన్ కోషియమ్ అనే మలయాళీ సినిమాకు రీమేక్‌గా భీమ్లానాయక్ తెరకెక్కింది. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే, పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అంటూ థమన్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25, 2022 న విడుదల కానుంది.

    Also Read: ఏపీ సర్కార్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన ఏపీ టీచర్స్.. సమ్మెలో సై

    Tags