
Heroes Who Changed Names: సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. ఎందుకంటే ఆ విధంగా ఉంటే కెరీర్ బాగుంటుందేమో అని, ఈ విధంగా ఉంటే తమకు అవకాశాలు బాగా వస్తాయేమోనని వారు సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. అలాంటి సెంటిమెంట్లలో పేరు మార్చుకోవడం కూడా ఒకటి. చాలా మంది హీరోలు, హీరోయిన్‌లు, దర్శకులు, నిర్మాతలు పేర్లు మార్చుకొని ఆ తరువాత తమ ఫేట్‌ను కూడా మార్చుకున్నారు. మొన్న చనిపోయిన తారకరత్న నుంచి అనేక మంది పేరు మార్చుకున్న తర్వాత సినీ పరిశ్రమలో అవకాశాలు సంపాదించారు.
తారకరత్నగా మారిన ఓబులేషు..
ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న గుండెపోటుతో 23 రోజులు మృత్యువుతో పోరాడి శనివారం చనిపోయాడు. తారకరత్న అసలు పేరు ఓబులేషు. ఇంట్లో అందరు ముద్దుగా ‘ఓబు’ అనే పిలిచేవారు. ఇంట్లో వాళ్లే కాకుండా చుట్టాలు, ఫ్రెండ్స్ కూడా అదే పేరుతో పలకరించేవారని తారకరత్న సన్నిహితులు చెప్పుకుంటున్నారు.

చిరంజీవిగా శివశంకర వరప్రసాద్..
మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఆయన పేరును దర్శక నిర్మాతలు చిరంజీవిగా మారారు. పేరుకు తగ్గట్లుగా ఆయన ఇండస్ట్రీలో చిరంజీవిగా ఎదిగారు.

మోహన్‌బాబుగా భక్త వత్సల నాయుడు..
ఇక కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కూడా ఇండస్ట్రీలో తన పేరు మార్చుకున్నాడు. ఆయన అసలు పేరు భక్తవత్సల నాయుడు. ఇండస్ట్రీలోకి వచ్చాక తన పేరు మోహన్‌బాబుగా మార్చుకున్నారు.

రజినీకాంత్‌గా శివాజీరావు గైక్వాడ్..
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా సినిమాల్లోకి వచ్చాక తన పేరు మార్చుకున్నారు. దర్శకుడు బాలచందర్ ఈపేరు మార్చినట్లు సమాచారం. రజినీ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. మహారాష్ట్రకు చెందిన ఆయన ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేసిన ఆయన తన టాలెంట్‌తో తమిళ సూపర్‌స్టార్‌గా ఎదిగారు.
పవన్ కళ్యాణ్‌గా కళ్యాణ్‌బాబు..
ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్‌బాబు. ఇండస్ట్రీలోకి వచ్చాక ఆయన పేరును కొంతమంది సూచన మేరకు పవన్ కళ్యాణ్‌గా మార్చుకున్నా. అయినా ఇప్పటికీ చిరంజీవి, నాగబాబు, పవన్ గురించి మాట్లాడినప్పుడు కళ్యాణ్‌బాబు అని చెబుతారు.

రవితేజగా.. రవిశంకర్‌రాజు భూపతిరాజు..
తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ అసలుపేరు ‘రవిశంకర్ రాజు భూపతిరాజు’ పెద్దగా ఉండడంతో పేరును రవితేజగా షార్ట్ చేసుకున్నారు.
రామ్‌చరణ్‌తేజ్‌గా రామ్ చరణ్..
ఇక మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తేజ్ అసలు పేరు రామ్ చరణ్. ఇండస్ట్రీలోకి వచ్చాక పేరు వెనక తేజ్ యాడ్ చేసుకున్నారు.
నానిగా మారిన నవీన్‌బాబు..
విలక్షణ నటుడుగా గుర్తింపు పొందిన హీరో నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. అప్పటికే నవీన్ పేరుతో హీరోలు ఉండడం, ఆయన ఇండస్ట్రీలో రాణించకపోవడంతో నవీన్‌బాబు కాస్త నానిగా మారారు.
సాయి ధరమ్ తేజ్.. సాయితేజ్
రీసెంట్‌గా సాయి ధరమ్ తేజ్ తన పేరులోని ధరమ్ తీసేశారు. సాయి తేజ్‌గా పేరు మార్చుకున్నాడు
– విశ్వక్ సేన్ అసలు పేరు దినేశ్ నాయుడు.. న్యూమరాలజీ ప్రకారం విశ్వక్ సేన్‌గా మార్చుకున్నారు.
– అలనాటి అందాల నటుడు, సోగ్గాడు శోభన్‌బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. పేరు పెద్దగా ఉండి పిలవడానికి ఇబ్బందిగా ఉండడంతో శోభన్‌బాబుగా దర్శకులు మార్చేశారు.
– సూపర్ స్టార్ కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. ఈయన పేరుకూడా పెద్దగా ఉండడం, పలకడానికి సులువుగా లేకపోవడంతో కృష్ణగా మార్చుకున్నారు.
– మురళీ మోహన్ అసలు పేరు రాజబాబు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చేనాటికే సినిమాల్లో రాజబాబు అనే కమెడియన్ ఉండటంతో తనపేరును మురళీమోహన్‌గా మార్చుకున్నారు.
– రాజేంద్రప్రసాద్ అసలు పేరు గద్దె వెంకట నారాయణ. పేరు లెన్తీగా ఉండడం, పలకడానికి ఇబ్బందిగా ఉండడంతో రాజేద్రప్రసాద్‌గా షార్డ్ చేసుకున్నారు.
– ప్రకాష్‌రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్. రాయ్ అనే పదం ఎక్కువగా మహిళలు వాడుతుండడంతో రాయ్ తీసేసి రాజ్ చేసుకున్నారు.
– సినీ నటుడు అర్జున్ అసలు పేరు శ్రీనివాససర్జ. కన్నడ నటుడు అయిన ఆయన తన పేరును అర్జున్‌గా మార్చుకున్నారు.
– మరో తమిళ హీరో విక్రమ్ అసలు ‘కెనడీ జాన్ విక్టర్’ దానిని పలకడానికి ఇబ్బందిగా ఉండడంతో కెనడీ జాన్ విక్టర్ కాస్త విక్రమ్ అయ్యాడు.
– తమిళ హీరో సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. షార్డ్ చేయడానికి ఇలా సూర్యగా మార్చుకున్నారు. సూర్య తమ్ముడు కార్తి పూర్తి పేరు కార్తీక్ అందులోని చివరి అక్షరాన్ని తొలిగించి కార్తీగా మారాడు.
– ఇక ధనుశ్ అసలు పేరు వెంకటేశ్ ప్రభు కస్తూరి రాజా. వెంకటేశ్ అప్పటికే ఇండస్ట్రీలో ఉండడం, పేరు కూడా పెద్దగా ఉండడంతో మూడక్షరాలకు కుదించుకున్నారు.
– తమిళ హీరో ఆర్య అసలు పేరు జంషెడ్ సెథిరాకాత్. ఆయన పేరు కూడా పలకడం కష్టంగా ఉండడంతో రెండక్షరాల ఆర్యగా మారాడు.
– తమిళ హీరో జీవా అసలు పేరు అమర్ చౌదరి. ఆయన కూడా రెండక్షరాల్లో పేరు సెట్‌చేసుకున్నారు.
– మరో తమిళ నటుడు నెపోలియన్ అసలు పేరు కుమరేసన్ దురైస్వామి. ఆయన కూడా కుదించుకుని నెపోలియన్‌గా మారారు.
– సత్యరాజ్ అసలు పేరు రంగరాజ్.. రంగరాజ్ కలిసి రాకపోవడంతో సత్యరాజ్‌గా పేరు మార్చుకున్నారు.
– ఇక కేజీఎఫ్ ఫేమ్ యశ్ అసలు పేరు నవీన్‌కుమార్‌గౌడ. ట్రెండ్‌కు తగ్గట్లుగా పేరు లేకపోవడంతో యశ్‌గా మార్చుకున్నారు.
– దివంగత కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్ అసలు పేరు సంపత్ కుమార్.
– కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ అసలు పేరు పుట్టస్వామయ్య ముత్తురాజ్.
– కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ అసలు పేరు పుట్టస్వామయ్య ముత్తురాజ్
– మమ్ముట్టి అసలు పేరు ముహమ్మద్ కుట్టీ ఇస్మాయిల్ పనిపరంబిల్. పలకడానికి కష్టంగా ఉందని మమ్ముట్టిగా మార్చుకున్నారు.
– హిందీ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టినపుడు తల్లి దండ్రులు పెట్టిన పేరు ‘ఇంక్విలాబ్’ ఆ తర్వాత అమితాబ్‌గా మార్చారు.
– బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సిల్వర్ స్క్రీన్ పేరైతే.. ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజీవ్ హరి ఓం భాటియా.
– మరో హిందీ హీరో అజయ్ దేవ్‌గణ్ అసలు పేరు విశాల్ దేవ్‌గణ్. ఇండస్ట్రీ కోసం విశాల్‌ను అజయ్‌గా మార్చుకున్నారు.
– సన్ని డియోల్ అసలు పేరు విజయ్ సింగ్ దేవోల్. దానికి పలకేందుకు ఈజీగా మార్చుకున్నారు.
– బాబీ డెయిల్ అసలు పేరు విజయ్ సింగ్ దేవోల్.. ఆయన కూడా బాబి డెయిల్‌గా సులభతరం చేసుకున్నారు.
– అలనాటి బాలీవుడ్ హీ మ్యాన్, సన్ని డియోల్, బాబి డియోల్ తండ్రి ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్.. ఆయన ధరమ్‌సింగ్‌ను ధర్మేంద్రగా మార్చుకున్నారు.
– కండల వీరుడు సల్మాన్‌ఖాన్ పూర్తిపేరు అబ్దుల్ రషీద్ సలీమ్ సల్మాన్‌ఖాన్. పేరు పొడవుగా ఉందని చివరి పదాలనే ఉంచుకున్నాడు.
– ఒకప్పటి బాలీవుడ్ అగ్ర నటుడు జితేంద్ర అసలు పేరు రవికపూర్
– ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్‌మాన్ అసలు పేరు దిలీప్ కుమార్. ఆయన మతం మార్చుకుని పేరు రెహ్‌మాన్‌గా మార్చుకున్నారు.
