Nandamuri Balakrishna: సీనియర్ ఎన్టీఆర్ మహా నటుడే కాదు, మహా దర్శకుడు కూడా. సీనియర్ ఎన్టీఆర్ విజన్ అద్భుతమైనది. ఆయన తీసిన సినిమాలు నేటికీ గొప్ప చిత్రాలుగానే నిలిచాయి. అయితే, సీనియర్ ఎన్టీఆర్ ఎంతమంది స్టార్లను డైరెక్ట్ చేసినా బాలయ్యను డైరెక్ట్ చేసేటప్పుడు కాస్త ప్రత్యేక జాగ్రత్త తీసుకునేవారు.
ఎంతైనా కొడుకును డైరెక్ట్ చేయడం, అలాగే తండ్రి డైరెక్షన్ లో కొడుకు నటించడం ప్రత్యేకమే. అయితే, ఆ అవకాశం బాలకృష్ణకు దక్కింది. నిజానికి బాలయ్యను హీరోగా పెట్టి వరుస సినిమాలను డైరెక్ట్ చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేసారు. కానీ.. అది సాధ్యం కాలేదు. ఆయన అప్పటికే రాజకీయాల్లో బిజీగా ఉండటం చేత ఎక్కువ సినిమాలు బాలయ్యతో చేయలేకపోయారు.
కానీ, ఎవ్వరూ టచ్ చేయని సబ్జెక్ట్స్ ను ఎంతో వ్యయప్రయాసాల ఓర్చి.. ఎన్టీఆర్ సినిమాలు చేశారు. మరి ఎన్టీఆర్ తీసిన అలాంటి సినిమాల్లో బాలయ్య కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అవేమిటో చూద్దాం రండి.
తాతమ్మ కల :
‘తాతమ్మ కల’ ఈ సినిమా పేరులోనే కమ్మని పల్లె వాతావరణం కనిపిస్తోంది. ఈ సినిమాతోనే బాలయ్య తన 14వ యేట సినీరంగ ప్రవేశం చేసి..నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. తాతమ్మ కలను నెరవేర్చే ముని మనవడిగా బాలయ్య అద్భుతంగా నటించి మెప్పించాడు. ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని గొప్పగా డైరెక్ట్ చేశారు.
Also Read: సమతామూర్తి విగ్రహ నిర్మాణంలో ప్రత్యేకతలు ఇవే..
దానవీర శూర కర్ణ :
ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన ఈ దానవీర శూర కర్ణ.. నేటికీ ఎన్నటికీ ఈ చిత్రం ప్రత్యేకమే. భారతీయ అరుదైన చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఒకటి. పైగా అప్పట్లో తెలుగు సినిమా రికార్డ్ లను తిరగరాసిన సినిమాగా కూడా ఈ చిత్రం నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య అభిమన్యుడిగా నటించారు.
అక్బర్ సలీం అనార్కలి:
ఎన్టీఆర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్బర్ గా నటించగా.. సలీంగా బాలయ్య బాబు నటించి.. ఎన్టీఆర్ కే పోటీ ఇచ్చారు. ఈ చిత్రం చేయడానికి ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు.
శ్రీమద్విరాట పర్వము:
1979లో వచ్చిన ఈ సినిమాలో కూడా తండ్రి సీనియర్ ఎన్టీఆర్ తో పాటు బాలయ్య బాబు నటించి మెప్పించారు.
శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం:
ఎన్టీఆర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో.. ఎన్టీఆర్ గారు వెంకటేశ్వర స్వామిగా నటించారు. అయితే, ఈ చిత్రంలో బాలయ్య నారదుడి పాత్రలో కనిపించడం విశేషం.
శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర:
నిజంగా ఈ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తెలుగు ప్రేక్షకుల మదిలో చొచ్చుకుపోయింది. ఈ సినిమాలో బాలయ్య సిద్దుడి పాత్రలో అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్ గారు కూడా ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు.
Also Read: సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానున్న ‘1945’