Vijay Devarakonda Rashmika Wedding: ఈ నెల 26న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలస్ లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) జంట పెళ్లి చేసుకోబోతున్న సందర్భంగా సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది. వీళ్లిద్దరు ఇప్పటి వరకు పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. అయినప్పటికీ ఇంత ప్రచారం జరుగుతుందంటే, వీళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన రోజు, బ్లాస్ట్ అవ్వుద్ది అనే చెప్పాలి. అయితే అందరికీ తెలిసిన విషయాన్నీ వీళ్ళు ఎందుకు దాచిపెట్టాలని అనుకుంటున్నారో ఎవరికీ తెలియడం లేదు కానీ, వీళ్ళ పెళ్లి గురించి మాత్రం ప్రతీ చిన్న అప్డేట్ సోషల్ మీడియా లో లీక్ అవుతూనే ఉంది. రీసెంట్ గానే వీళ్లిద్దరి పెళ్లి శుభలేఖ కూడా లీక్ అయ్యింది. అయితే పెళ్ళికి సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళెవ్వరినీ పిలవలేదని , కేవలం విజయ్ దేవరకొండ కి బాగా దగ్గరైన వాళ్ళు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరు కాబోతున్నారని మన అందరికీ తెలిసిందే.
అలా విజయ్ దేవరకొండ మనసుకి బాగా దగ్గరైన వారిలో ఒకరు సందీప్ రెడ్డి వంగ. ఈరోజు ఆయన ఈ స్థాయిలో ఉన్నాడంటే అందుకు కారణం సందీప్ వంగ నే. విజయ్ దేవరకొండ ఆయన్ని ఎల్లప్పుడూ తన సోదరుడిగానే భావిస్తూ వచ్చాడు. అదే విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా ఈ వేడుకకు హాజరు కాబోతున్నారట. విజయ్ దేవరకొండ కి అత్యంత సాన్నిహితులలో ఒకరు అల్లు అర్జున్. ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్నీ అల్లు అర్జున్, అదే విధంగా విజయ్ దేవరకొండ కూడా చెప్పుకొచ్చారు. అయితే వీళ్ళతో పాటు ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఈ పెళ్ళికి హాజరు కాబోతున్నట్టు సమాచారం. విజయ్ దేవరకొండ కి అత్యంత ఆప్తులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరు అవుతున్నారు, ఆ ఆప్తుల లిస్ట్ లో ముఖేష్ అంబానీ కూడా ఉన్నదంటే మనోడి రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక జంటలకు వెలకట్టలేని పెళ్లి బహుమతి ఏదైనా ఉందా అంటే, అది అంబానీ ఫ్యామిలీ రావడమే. సాధారణంగా వీళ్ళు ఏ పెళ్లి ఫంక్షన్స్ కి కూడా వెళ్లరు. వెళ్లినా చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ జంట పెళ్ళికి రాబోతున్నారు అనేది సాధారణమైన విషయం కాదు. రాబోయే రోజుల్లో ముఖేష్ అంబానీ జియో స్టూడియోస్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ ఏదైనా సినిమా చేయడానికి ఒప్పుకున్నాడా?, వీళ్లిద్దరి మధ్య పరిచయం అలా ఏర్పడిందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.