Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. జగన్ కు తిరుగులేదని చెబుతున్నక్రమంలో ఉద్యోగులతో విభేదాలు వచ్చిన సందర్భంలో చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగుల పక్షాన నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.దీన్ని ఉపయోగించుకుని వారిని తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. జగన్ మొండి వైఖరితోనే ఉద్యోగులతో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు జగన్ ఉద్యోగులకు వచ్చిన గొడవలను క్యాష్ చేసుకోవాలని బాబు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో దీన్ని అస్ర్తంగా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ కు ఇక అధికారం దక్కనీయకుండా చేయాలనే చూస్తున్నట్లు చెబుతున్నారు. బాబులో వచ్చిన మార్పుతో ఉద్యోగులు ఆయనకు మద్దతు ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది. కానీ జగన్ పై ఉన్న కోపంతో వారు బాబుతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతారనే వాదన కూడా వినిపిస్తోంది.
సీఎం జగన్ తన గోతిని తానే తవ్వుకున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఉద్యోగులకు జగన్ కు మధ్య దూరం పెరిగింది. వారు సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు. ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రభుత్వ విధులకు ఆటంకం కలగనుంది. కానీ ప్రభుత్వం మాత్రం మొండి వైఖరి అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్వయంకృతాపారాధంతోనే కష్టాలు కొనితెచ్చుకుంటోంది. పరిస్థితులను పరిశీలిస్తున్న చంద్రబాబు ఉద్యోగుల పక్షాన నిలిచేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఉద్యోగుల డిమండ్లు నెరవేరుస్తారా? ఎస్మా ప్రయోగిస్తారా?
సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలో తమకు తిరుగులేదని భావిస్తున్న వైసీపీ వింత పోకడలను బేరీజు వేసుకుని బాబు తన వ్యూహాలను ఖరారు చేసుకుంటున్నారు. అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఉద్యోగుల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలనే ప్రభుత్వంపై పోరాడేందుకు డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందో అంతుబట్టడం లేదు. దీంతో బాబు జగన్ పై పోరాడేందుకు ఇదే అవకాశంగా చూస్తున్నారు. పీఆర్సీ ఉద్యోగులు అడిగిన ప్రకారమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ఉద్యోగులతో కలిసి పోరాడాలని చూస్తున్నారు. దీంతో జగన్ కు మరో సమస్య వచ్చి పడినట్లు అయింది. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండాలని చూసినా ఉద్యోగుల నిర్వాకంతో దొరికిపోతున్నారు. దీన్ని సావకాశంగా తీసుకుని బాబు ఏ మేరకు లబ్ధి పొందుతారో వేచి చూడాల్సిందే.
Also Read: తగ్గడమే బెస్ట్.. ఉద్యోగ సంఘాలను చర్చల దిశగా బతిమాలుతున్న జగన్ సర్కార్..!