Ravi Teja: ‘మాస్ మహా రాజా’ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘రవితేజ’ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరో అయ్యాడు కెరీర్ ఆరంభంలో చిన్నాచితకా వేషాలు వేసి.. అంచెలంచెలుగా ఎదిగాడు. స్వయంకృషి తో, పట్టుదలతో స్టార్ గా ఎదిగి, మరెందరికో ఛాన్స్ లు ఇచ్చి వాళ్ళను కూడా స్టార్లను చేశాడు.

మరి రవి తేజ పరిచయం చేసిన ఆ దర్శకులు ఎవరో చూద్దాం.
శ్రీను వైట్ల :

టాలీవుడ్ లో పదేళ్ల క్రితం వరకూ శ్రీను వైట్ల టాప్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ గా చక్రం తిప్పిన ఈ కమర్షియల్ డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. మొదట డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది రవితేజనే. ‘నీ కోసం’ అనే సినిమాతో శ్రీను వైట్లను దర్శకుడిని చేశాడు రవితేజ.1999లో వచ్చిన ఈ చిత్రానికి అవార్డులు కూడా రావడం విశేషం.
Also Read:ఉద్యోగులకు బాసటగా బాబుః జగన్ కు తలనొప్పేనా?
అగస్త్యన్ :
అగస్త్యన్ అనగానే గుర్తు పట్టలేక పోవచ్చు. కానీ, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. రవితేజ చేతుల మీదుగా పరిచయమైన ఈ దర్శకుడికి పిలిచి మరీ రవితేజ ఛాన్స్ ఇచ్చాడు.
యోగి :
చింతకాయల రవి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు యోగి. కానీ యోగికి మొదట అవకాశం ఇచ్చింది రవితేజనే. ఈ కలయికలో 2003లో ఒక రాజు ఒక రాణి సినిమా వచ్చి మంచి పేరు తెచ్చుకుంది.
ఎస్.గోపాల్ రెడ్డి:
కెమెరా మెన్ గా ఎస్.గోపాల్ రెడ్డి గారికి గొప్ప పేరు ఉంది. అయితే, ‘నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమోరీస్’ అనే సినిమాతో ఈ ప్రముఖ సినిమాటోగ్రఫర్ ను దర్శకుడిగా మార్చాడు రవితేజ.
బోయపాటి శ్రీను :

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ బోయపాటి శ్రీనునే. అయితే దర్శకుడిగా బోయపాటి శ్రీనును భద్ర సినిమాతో పరిచయం చేసింది రవితేజనే.
హరీష్ శంకర్ :

హరీష్ శంకర్ వరస విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు. కాగా 2006లోనే షాక్ అనే సినిమాతో మొదటి ఛాన్స్ ఇచ్చింది రవితేజనే.
సముద్రఖని :
ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖనిని తెలుగులో దర్శకుడిగా పరిచయం చేసింది ఎవరో తెలుసా ? రవితేజనే. 2010లో ఈ కాంబినేషన్‌లోనే శంభో శివ శంభో అనే సినిమా వచ్చి.. సూపర్ హిట్ అయింది.
గోపీచంద్ మలినేని :

వరుస ప్లాప్ ల్లో ఉన్న రవితేజకు క్రాక్, బలుపు లాంటి సూపర్ హిట్ సినిమాలను ఇచ్చిన ‘గోపీచంద్ మలినేని’ని ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం చేసింది రవితేజనే.
కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ :
బాబీ ప్రస్తుతం స్టార్ హీరోలతో వరస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు చిరంజీవితో కూడా సినిమా చేస్తున్నాడు. అయితే, 2014లో పవర్ అనే సినిమాతో బాబీని ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం చేసింది రవితేజనే.
విక్రమ్ సిరికొండ :
విక్రమ్ సిరికొండ ‘టచ్ చేసి చూడు’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రవితేజ ఇచ్చిన అవకాశాన్ని ఇతను వినియోగించుకోలేక పోయాడు.
శరత్ మండవ :
శరత్ మండవ అనే కొత్త దర్శకుడిని ప్రస్తుతం పరిచయం చేస్తున్నాడు రవితేజ. శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా వస్తుంది.
Also Read: సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానున్న ‘1945’