Directors: వాళ్ల ఫెయిల్యూర్స్ ను నిజాయితీగా ఒప్పుకున్న డైరెక్టర్స్ వీళ్లే…

మొత్తానికైతే సినిమాల విషయంలో చాలామంది చాలా రకాల అపోహలను ఎదుర్కొంటున్నప్పటికీ కొంతమంది మాత్రం చాలా సక్సెస్ ఫుల్ గా సినిమాలను డీల్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

Written By: Gopi, Updated On : March 23, 2024 12:33 pm

Lokesh Kanagaraj

Follow us on

Directors: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా అనేది ఫ్లాప్ అయితే దానిని నిజాయితీగా ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ ప్లాప్ ను మేనేజ్ చేస్తూ తన వల్ల కాకుండా వేరే వాళ్ళ వల్ల సినిమా ఫ్లాప్ అయిందని చెప్తారు. కొంతమంది నా స్క్రిప్ట్ మొత్తం మార్చేశారు అంటూ చాలా కథనాలైతే వస్తుంటాయి. కానీ మొత్తానికైతే ఒక సినిమా హిట్ అయితే దర్శకుడు ఎంత మంచి పేరు సంపాదించుకుంటాడో, ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల పెద్ద బ్యాడ్ నేమ్ ని సంపాదించుకోవాల్సి వస్తుంది.

ఇక మొత్తానికైతే సినిమాల విషయంలో చాలామంది చాలా రకాల అపోహలను ఎదుర్కొంటున్నప్పటికీ కొంతమంది మాత్రం చాలా సక్సెస్ ఫుల్ గా సినిమాలను డీల్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన లియో సినిమా ప్లాప్ అవ్వడంలో పూర్తి తప్పు తనదే అని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తనే స్వయంగా ఒప్పుకున్నాడు. అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవడంతో దానివల్లే ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ లోకేష్ ఒక ఇంటర్వ్యూలో లియో సినిమా ప్లాప్ ఆవ్వడానికి పూర్తి బాధ్యత నాదే అని తెలియజేయడం విశేషం…

ఇక యమదొంగ సినిమా సమయంలో కూడా రాజమౌళి ఇలాంటి ఒక అసహనాన్ని వ్యక్తం చేశాడు. యమదొంగ సినిమా సక్సెస్ అయినప్పటికీ టెక్నికల్ గా రాజమౌళి ఇంకా కొంచెం బెటర్ గా ఆ సినిమాను చేసి ఉంటే బాగుండేదని తను ఇప్పటికీ ఆ సినిమా విషయంలో ఇబ్బంది పడుతూనే ఉంటాడు.

ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ రాజమౌళి సినిమాలో ఉండే విధంగా ఎమోషన్స్, ఎలివేషన్ అయితే ఈ సినిమాలో ఉండవు. కాబట్టి దానివల్ల ఈ సినిమా సక్సెస్ అయిన కూడా కొంతవరకు ప్రేక్షకుల్ని నిరాశ పరిచిందనే చెప్పాలి. ఇక ఆ విషయాన్ని రాజమౌళి ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అది అలా జరగడం లో తప్పంతా తనదే అని చెప్పడం విశేషం…