https://oktelugu.com/

Star Heroes : సూపర్ హిట్ సినిమాలు చేయకపోయిన స్టార్ హీరోలతో అవకాశాలను అందుకున్న డైరెక్టర్స్ వీళ్లే…

మారుతి సినిమా అంటే ప్రేక్షకుల్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు కూడా లేవు. మరి ఇలాంటి సమయంలో ప్రభాస్ లాంటి స్టార్ హీరో మారుతికి సినిమా చేసే అవకాశాన్ని ఎలా ఇచ్చాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది...

Written By:
  • NARESH
  • , Updated On : March 31, 2024 / 07:23 PM IST

    These are the directors who got opportunities with star heroes

    Follow us on

    Star Heroes : సినిమా ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ఒక్కో జానర్ లో సినిమా చేస్తూ సక్సెస్ లను అందుకుంతారు. ఇక కొంత మంది దర్శకులు కొత్తగా హిట్ సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా స్టార్ హీరోలతో సైతం అవకాశాలను అందుకొని వాళ్ల మార్కెట్ ను కూడా భారీగా పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే చాలామంది స్టార్ హీరోలు సక్సెస్ లు సాధించిన స్టార్ డైరెక్టర్లకే అవకాశాలను ఇస్తూ ఉంటారు.

    కానీ కొంతమంది మీడియం రేంజ్ డైరెక్టర్లు చెప్పుకోదగ్గ హిట్ లేకపోయిన స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంపత్ నంది గురించి చెప్పుకోవాలి. మొదటి సినిమాతో ఆవరేజ్ హిట్ గా నిలిచినప్పటికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా కూడా ఆవరేజ్ గా ఆడింది. పక్కా కమర్షియల్ లాంటి ఒక భారీ ఫ్లాప్ సినిమాను తీసిన తర్వాత డైరెక్టర్ మారుతి కూడా ప్రభాస్ తో రాజాసాబ్ అనే సినిమా చేసే అవకాదాన్ని అందుకున్నాడు. ఇక మారుతి కూడా ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోతో కూడా సినిమా చేయలేదు.

    అయినప్పటికీ ప్రభాస్ తో ఒక భారీ అవకాశాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీద ఉంది తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది… ఇక ఇప్పటివరకు మారుతి పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. ఒకటి రెండు సినిమాలను ఇస్తే ఆయన సినిమాలు ఏవి కూడా అంత పెద్దగా సక్సెస్ అవ్వలేదు.

    మారుతి సినిమా అంటే ప్రేక్షకుల్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు కూడా లేవు. మరి ఇలాంటి సమయంలో ప్రభాస్ లాంటి స్టార్ హీరో మారుతికి సినిమా చేసే అవకాశాన్ని ఎలా ఇచ్చాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది… మొత్తానికైతే ఈ ఇద్దరు డైరెక్టర్లు భారీ సక్సెస్ లు సాధించనప్పటికీ స్టార్ హీరోలతో అవకాశాలను అందుకోవడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పాలి…