Horoscope Today: ఈ నాలుగు రాశులపై ఈరోజు సూర్యదేవుని అనుగ్రహం.. అన్నీ శుభాలే..

అనారోగ్యాల పాలవుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి. విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.

Written By: Chai Muchhata, Updated On : August 18, 2024 8:05 am

Horoscope Today

Follow us on

Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈరోజు ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఆదివారం చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు.ఈరోజు ఆయుష్మాన్ యోగం ఏర్పడనుంది. దీంతో సూర్యదేవుని అనుగ్రహంతో 4 రాశుల వారికి అనుకున్న ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఈ రాశి వారు పెట్టుబుడుల పెట్టడం వల్ల అధిక లాభాలు పొందుతారు. విదేశీ వ్యవహారాలు జరిపే వారికి ధన ప్రవాహం ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని వాదనలు ఉంటాయి. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభ రాశి:
అనారోగ్యాల పాలవుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి. విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.

మిథున రాశి:
వ్యాపారులకు కుటంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. సోదరులు ఉన్నవారు సంయమనంతో పాటించాలి. తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కొత్త పెట్టుబడులు పెడుతారు. ఇవి భవిష్యత్ లో మంచి లాభాలు ఇస్తాయి.

కర్కాటక రాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొందుతారు.

సింహారాశి:
శత్రవులతో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేసత్ారు. కొత్త పనిని ప్రారంభించడానికి ఈరోజు అనుకూలం. ప్రయాణాలు లాభిస్తాయి. సహోద్యోగితో ఉద్యోగులు సంతోషంగా ఉంటారు.

కన్య రాశి:
విద్యార్థులు భవిష్యత్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల సాయంతో కొత్త పెట్టుబడులు పెడుతారు. ఎవరిదగ్గరనైనా అప్పు తీసుకుంటే తిరిగి వెంటనే చెల్లిస్తారు. వివాహ ప్రయత్నాలు సాగుతాయి.

తుల రాశి:
కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కొన్ని రోజులు పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆగిపోయిన వ్యాపారం తిరిగి ప్రారంభం అవుతుంది.

వృశ్చిక రాశి:
చట్టపరమైన అంశాల్లో విజయం మీదే ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఇంటికి అతిథులు రావొచ్చు. విలాసవంతానికి డబ్బు ఖర్చు చేస్తారు. ఆదాయం, ఖర్చలు మధ్య బ్యాలెన్స్ మెయింటేన్ చేయాలి.

ధనస్సు రాశి:
భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు. ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. ఇతరులకు ఆర్థిక సాయం చేస్తారు.

మకర రాశి:
ఉద్యోగులు తోటివారితో సంతోషంగా ఉంటారు. పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అధికారులతో వాగ్వాదాలు ఉంటాయి. కష్టపడి పనిచేసేవారికి ఫలితం ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.

కుంభరాశి:
కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఏదైనా పని పెండింగ్ లో ఉంటే ఈరోజు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యలతో సంతోషంగా ఉంటారు. కొత్త ఆదాయం పొందేందుకు అవసరమైన వనరలు సమకూర్చుకుంటారు.

మీనరాశి:
కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు రిస్క్ తీసుకుంటారు. ఉద్యోగులు అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు.