
‘శృతి హాసన్’ చాల బోల్డ్.. నిజమే, కానీ పబ్లిక్ గా బాయ్ ఫ్రెండ్ మూతి నాకుతూ ఫోజులు ఇచ్చేంత బోల్డ్ అని ఎవరూ ఊహించలేదు. అయినా ఇది బోల్డ్ ఎలా అవుతుంది ? దిగజారుడుతనానికి పరాకాష్ట అవుతుంది. అసలు గత కొంతకాలంగా శృతి హాసన్ పైత్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది అనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఎదుకంటే శృతి హాసన్ వ్యవహారం మరీ మితిమీరిపోతుంది.
ఇలాంటి విషయాల్లో తనను ట్రోలింగ్ చేస్తే.. ‘అదేంటి ? బాయ్ ఫ్రెండ్ ను ముద్దు పెట్టుకోవడం తప్పా ? ఏ కాలంలో ఉన్నారు మీరంతా ? అంటూ శృతి హాసన్ తనదైన శైలిలో రెచ్చిపోతుంది అనుకోండి. కానీ శృతి హాసన్ ఒక సెలబ్రిటీ. ఆమె బయటకు వస్తే క్లిక్కుమనిపించేందుకు కెమెరా కళ్ళు కాచుకుని ఉంటాయి. అలాంటిది ఈ స్టార్ హీరోయిన్ ఏకంగా తన లవర్ తో వస్తే.. కెమెరా కళ్ళు అలాగే కళ్లప్పగించి చూస్తూ ఉంటాయి అని తెలియకపోతే ఎలా ?
ఆమె ఒంపుసొంపులతో పాటు బాయ్ ఫ్రెండ్ తో సాగే ప్రతి కదలికను తమ కెమెరాల్లో బంధించి నానా యాగీ చేస్తారని తెసుకోవాలిగా. నిజానికి ఇవ్వన్నీ శృతి హాసన్ కి తెలుసు. మరి తెలిసి కూడా ఆమె ఏమి చేసింది ? తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికతో కలిసి ముంబైలోని ఓ సూపర్‌మార్కెట్‌లో ప్రత్యక్షమై.. శాంతనుకు హగ్గులిస్తూ, పబ్లిక్ గా కసిగా ముద్దులు పెడుతూ విచ్చలవిడిగా రెచ్చిపోయింది.
శృతి హాసన్ చేసిన ఈ బాగోతాలను అక్కడి జనాలు తమ ఫోన్ కెమెరాల్లో బంధించి నెట్టింట అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం శృతి హాసన్ ముద్దులు హాగ్ లకు సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇవి శృతి హాసన్ కంట పడ్డాయి. మరొక హీరోయిన్ అయితే అవి చూసి సిగ్గుతో చితికిపోతుంది. కానీ శృతి హాసన్ ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్ చేసి.. బోల్డ్ యువత పట్ల తన విశాల హృదయాన్ని ఘనంగా చాటుకుంది.