Homeఅత్యంత ప్రజాదరణమాయమాటలతో చెల్లి.. రహస్యంగా అక్కతో పెళ్లి

మాయమాటలతో చెల్లి.. రహస్యంగా అక్కతో పెళ్లి

girl's family was harassed in Guntur

అతివల కోసం ఎన్ని చట్టాలు తెస్తున్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. రోజుకో కేసు వెలుగు చూస్తూనే ఉంది. ఎక్కడో ఒక చోట మహిళలు అణిచివేతకు గురవుతూనే ఉన్నారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని లొంగదీసుకుని తమ కోర్కెలు తీర్చుకుని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. ఎన్నో కేసుల్లో ఎందరో బలవుతున్నా ఇంకా ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఫలితంగా మహిళలు నిత్యం వేధింపులకు గురవుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జగన్ ప్రభుత్వం పటిష్ట చట్టం తెచ్చినా వారి బతుకుల్లో మాత్రం వెలుగులు రావడం లేదు.

తాజాగా గుంటూరు జిల్లా చిలుకలూరి పేటలో ఓ దారుణం వెలుగుచూసింది. బంధువుల ఇంటికి వచ్చిన అమ్మాయిని మాయమాటలతో లొంగదీసుకుని వారి కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేసి వారిని నిలువునా దోపిడీ చేసిన సంఘటన చోటుచేసుకుంది. తనతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి కుటుంబాన్ని బెదిరింపులకు పాల్పడ్డాడు. వాటిని బయట పెట్టకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి నుంచి రూ.3.30 లక్షలు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా వారి అక్కను సైతం రహస్యంగా పెళ్లి చేసుకుని బాధిత కుటుంబాన్ని అగాధంలోకి నెట్టాడు.

దీంతో తమకు జరిగిన అన్యాయంపై ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుడు జోష్ బాబు పొన్నూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్సై కోటేశ్వర్ రావు అతడిపై పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

మహిళల ఆత్మగౌరవం అంగడి సరుకుగా చేస్తున్నారు. వారి ఆశలను అడియాశలు చేస్తున్నారు. మోసపూరిత విధానాలతో వారిని లొంగదీసుకుని తమ కోర్కెలు తీర్చుకుంటూ నట్టేట ముంచుతున్నారు. నేరపూరిత కోణాలు ఎన్ని జరుగుతున్నా మహిళల్లో రక్షణకు చర్యలు మాత్రం కానరాడం లేదు. చట్టాలెన్ని ఉన్నా అవి కాగితాలకే పరిమితమవుతున్న తరుణంలో అతివల కష్టాలు తీరే దారులే లేవా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంకెన్నాళ్లు మోసపోతూ జీవితాలను శిథిలం చేసుకోవడం అని మథనపడుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular