Bigg Boss 8 Telugu: భారీ అంచనాల నడుమ ఆదివారం గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 మొదటి రోజు నుండే ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రతీ సీజన్ లో రెండు మూడు ఎపిసోడ్స్ తర్వాత సీజన్ హీట్ వాతావరణం లో నడుస్తుంది. కానీ ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ నుండే గొడవలు మొదలయాయ్యి. నిన్న జరిగిన టాస్కుల ద్వారా ముగ్గురు చీఫ్స్ గా నిఖిల్, నైనికా మరియు యష్మీ గౌడ ఎంపికైన సంగతి తెలిసిందే. వీరిలో నిఖిల్ మరియు నైనికా చీఫ్స్ రేస్ లో ఉన్న శేఖర్ బాషా, బెజవాడ బెబక్క మరియు నబీల్ ఆఫ్రిది ని తప్పించి యష్మీ గౌడ ని చీఫ్ గా ఎంచుకోవడం పై నిన్న గొడవలు జరిగాయి. అలాగే శేఖర్ బాషా నిన్న ఆరంజ్ పండుతో కంటెస్టెంట్స్ తో ఆదుకోవడం పై సోనియా గొడవ పడింది.
ఇలా మొదటి రోజే హీట్ వాతావరణంలో హౌస్ నడిచింది. ఇక నేడు నామినేషన్స్ పర్వం జరిగింది. ప్రోమో లో మనమంతా చూసే ఉంటాం, ప్రేరణ మరియు సోనియా మధ్య నామినేషన్స్ లో పెద్ద గొడవే జరిగింది. ఈ నామినేషన్స్ ప్రక్రియ ద్వారా ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి నాగ మణికంఠ, బెజవాడ బేబక్క, యాంకర్ విష్ణు ప్రియా, శేఖర్ బాషా, ప్రేరణ , సోనియా, ప్రథ్వీరాజ్ నామినేట్ అయ్యారు. నిఖిల్ , నైనిక,యష్మీ గౌడ చీఫ్స్ అవ్వడం వల్ల వారికి నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ లభించింది. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో జరుగుతున్న ఓటింగ్ ప్రకారం ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారు?, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. అందరికంటే భారీ మార్జిన్ లీడ్ తో యాంకర్ విష్ణు ప్రియా మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో నాగ మణికంఠ కొనసాగుతున్నాడు. యాంకర్ విష్ణు ప్రియా ఎప్పటి నుండో ఆడియన్స్ కి సుపరిచితం అవ్వడం వల్ల ఆమెకి ఫ్యాన్ బేస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు నుండే ఉంది. కాబట్టి ఆమె మొదటి స్థానం లో కొనసాగుతుంది, ఇక నాగ మణికంఠ కి మొదటి ఎపిసోడ్ లోనే జనాల్లో సానుభూతి కల్గించే సందర్భాలు ఎదురు అయ్యాయి కాబట్టి ఆయన రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.
మూడవ స్థానంలో పృథ్వి రాజ్, నాల్గవ స్థానం లో శేఖర్ బాషా ఉండగా చివరి రెండు స్థానాల్లో బెజవాడ బేబక్క మరియు సోనియా అగర్వాల్ కొనసాగుతున్నారు. వీరిద్దరిలో బెజవాడ బేబక్క కాస్త తక్కువ మార్జిన్ తో సోనియా మీద లీడింగ్ లో ఉంది. బెజవాడ బేబక్క సోషల్ మీడియా లో బాగా పాపులర్ అవ్వడం వల్ల ఆమెకి కాస్త ఓటింగ్ ఎక్కువ ఉంది. కానీ సోనియా ఎవరికీ తెలియకపోవడం వల్ల డేంజర్ జోన్ లో ఉంది. చూసేందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపిస్తున్న సోనియా ఈ వారం లో తనని తాను నిరూపించుకుంటే గేమ్ లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి.