Bigg boss telugu season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్ట్ అయి రెండు రోజులే అయ్యింది. అందరు కొత్త వాళ్లే ఈసారి ఎక్కువగా ఉన్నారు. బాగా తెలిసిన పేస్ లు కంటే తెలియని పేస్ లే ఉన్నాయి. అయితే గతంలో ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చిన ఆషు రెడ్డి, అరియానా గ్లోరీ, ఇనయా సుల్తానా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. ఆర్జీవీ హీరోయిన్స్ అనే కాకుండా వాళ్లకు అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ సీజన్ లో అర్జీవి స్కూల్ నుంచి వచ్చిన సోనియా ఆకుల బిగ్ బాస్ లో రచ్చ చేస్తుంది. మొదటి రోజు నుంచే తను ఏంటో చూపిస్తుంది. అర్జీవీ హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉండాలి.. అన్నట్లుగానే సోనియా హౌస్ లో ప్రవర్తిస్తుంది. మొదటి రోజు శేఖర్ బాషా తో గొడవ పెట్టుకుంది. తినే ఫుడ్ తో ఆడుకుంటున్నారు. మీకు రెస్పాన్స్బిలిటీ లేదా అని వేసుకుంది. ఆ తరువాత బెజవాడ బేబాక్క మీద కూడా ఇలానే అంది. ఇంత మంది తినడానికి వెయిట్ చేస్తున్నారు. అందరి ఆకలి పట్టించుకోకుండా.. టైం పాస్ చేస్తున్నారు. ఒక్కసారిగా బిగ్ బాస్ టాస్క్ ఇస్తే ఏం చేస్తారని సోనియా బేబాక్కపై విరుచుకుపడింది. శేఖర్ బాషా మీద కూడా ఆరెంజ్ విషయంలో ఇలానే విరుచుకుపడింది. అసలే బిగ్ బాస్ తక్కువ రేషన్ ఇస్తుంటే.. వాటితో ఆటలేంటి అని సీరియస్ అయింది. కానీ ఆ తరువాత శేఖర్ బాషా తను మళ్లీ కలిసిపోయారు.
గతంలో బిగ్ బాస్ లో కెప్టెన్ ఉండేవారు. కానీ ఈ సీజన్ లో కెప్టెన్ ఉండరు. చీఫ్ లు ఉంటారు. అయితే వాళ్లు కూడా టాస్క్ లు ఆడి చీఫ్ పదవిని సొంతం చేసుకోవాలి. ఈ సీజన్ లో చీఫ్ పదవిని ఫస్ట్ నిఖిల్ గెలుచుకున్నాడు. ఆ తరువాత నైనిక సెకండ్ చీఫ్ గా టాస్క్ ఆడి సంపాదించుకుంది. ఈసారి బిగ్ బాస్ మూడో చీఫ్ ని ఎంచుకోమని.. వీరిద్దరికీ ఛాన్స్ ఇచ్చారు. దీంతో వాళ్లు యష్మీని ఎంచుకున్నారు. అప్పుడు సోనియా మీరు తీసుకున్న డెసిషన్ తప్పు అని చెప్పింది. యష్మీ ఎక్కువగా ఫైర్ అవుతుంది. తను ఈ రెండు రోజుల్లో అంతగా ఏం పని కూడా చేయలేదని నిఖిల్ ని అంటుంది. మనసులో ఏం దాచుకోకుండా సోనియా పైకి అనేస్తుంది. ప్రస్తుతం హౌస్ లో సోనియా రచ్చ రేపుతుంది. అందరికి ఇచ్చి పడేస్తుంది. అయితే నిఖిల్ పర్సనల్ గా యష్మీ ని చీఫ్ గా సెలెక్ట్ చేసాడని నెటిజన్లు కూడా అంటున్నారు. సోనియా చెప్పింది కరెక్ట్ అని ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆర్జీవి హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉండాలసిందే. ఇకపై హౌస్ లో ఎలాంటి గొడవలు మొదలవుతాయి చూడాలి మరి.