Homeఎంటర్టైన్మెంట్'సమంత'లో వచ్చిన మార్పులు ఇవే !

‘సమంత’లో వచ్చిన మార్పులు ఇవే !

Samantha‘అక్కినేని సమంత’ తాజాగా ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ కి సంబదించిన సీక్రెట్స్ ను చాల క్లారిటీగా చెప్పుకొచ్చింది. ఏమిటి ఆ సీక్రెట్స్ అంటే.. సామ్ మాటల్లోనే ‘నా కెరీర్‌ ప్రారంభించి 11 సంవత్సరాలు అవుతుంది. ఎంతో అనుభవం పొందాను. అయితే, గత కొంతకాలంగా నాలో కొన్ని ప్రధాన మార్పులు వచ్చాయి.

ఒకప్పుడు నాలో అభ‌ద్ర‌తా భావంతో పాటు నేను తీసుకునే నిర్ణయాల పట్ల అనేక స్వీయ సందేహాలు ఉండేవి. ఐతే కొంతకాలంగా నేను వాటిని అధిగమించడం నేర్చుకున్నాను. అదే క్రమంలో నా అభద్రతా భావాలను తగ్గించుకోవడం అలవాటు చేసుకున్నాను. అలాగే సినీ కెరీర్ కు సంబంధించి స్వేచ్ఛగా ఇప్పుడు రిస్క్‌లు తీసుకోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇవన్నీ నాలో కొత్తగా వచ్చిన మార్పులు.

నాలో వచ్చిన ఈ మార్పులు కారణంగా నా పై నాకు నమ్మకం పెరిగింది అంటూ సామ్ గర్వంగా చిన్నపాటి సిగ్గుతో చెప్పుకొచ్చింది. ఇక సమంత తన మైథాలాజికల్‌ మూవీ ‘శాకుంతలం’ కోసం జులై 5 నుండి డేట్లు ఇచ్చింది. హైదరాబాద్‌ లో వేసిన భారీ సెట్స్‌ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగనుంది. ఇక ఈ సినిమా కోసం సమంత బాగా కష్టపడుతుంది.

ఇప్పటికే కేవలం ఈ సినిమా కోసం నాలుగు కేజీలు బరువు కూడా తగ్గింది. పైగా ఈ సినిమాలో భారీ ఆభరణాలు ధరించి, కొన్ని సన్నివేశాల్లో బోల్డ్ గా కూడా నటించబోతుంది. మొత్తానికి తన కెరీర్ లోనే ఇది స్పెషల్ ఫిల్మ్ గా సామ్ భావిస్తోంది. పైగా ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ సినిమా షూటింగ్‌ యాభై శాతం పూర్తయింది. ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజుతో కలసి గుణ శేఖర్‌ తనయ నీలిమ గుణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి తెగ కష్టపడుతుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version