IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో పరుగుల వరద పారుతోంది. బ్యాటర్లు పోటీలు పడి ఫోర్లు, సిక్సర్లు కొడుతున్నారు. మరి కొంతమంది సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్నారు. ఈ తరుణంలో ఎంతటి తోపు బౌలరయినప్పటికీ బ్యాటర్ల దూకుడు ముందు చేతులెత్తేస్తున్నారు. కొంతమంది బౌలర్లు మాత్రం అత్యంత తెలివిగా బౌలింగ్ వేస్తూ బ్యాటర్ల నుంచి కాచుకుంటున్నారు. పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తున్నారు. వికెట్లు తీస్తూ తాము వెరీ వెరీ స్పెషల్ అని నిరూపిస్తున్నారు. ఇంతకీ ఆ బౌలర్లు ఎవరంటే..
ఈ ఐపిఎల్ లో బ్యాటర్ల హవా కొనసాగుతోంది. ఇలాంటి చోట ఐదుగురు బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. తెలివిగా బౌలింగ్ వేస్తూ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇవి భాగంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్ ఖలీల్ అహ్మద్ మందు వరుసలో ఉన్నాడు. ఇప్పటికీ అతడు ఎనిమిది మ్యాచ్లు ఆడి.. 31 ఓవర్స్ వేశాడు. 10 వికెట్లు పడగొట్టి 280 పరుగులు ఇచ్చాడు. ఈ పరంపరలో అతడు 37 డాట్ బాల్స్ వేశాడు.
పంజాబ్ బౌలర్ రబాడా ఈ సీజన్లో మెరుగ్గా బౌలింగ్ వేస్తున్నాడు. ఆ జట్టు ఓడిపోతున్నప్పటికీ.. అతడు తన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. 8 మ్యాచులు ఆడిన అతడు, 32 ఓవర్స్ బౌలింగ్ వేశాడు. పది వికెట్లు పడగొట్టి, 273 పరుగులు ఇచ్చాడు. ఇతడు 83 డాట్ బాల్స్ వేశాడు.
ముంబై బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. డాట్ బాల్స్ వేసిన బౌలర్ల జాబితాలో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఇతడు ఎనిమిది మ్యాచ్లు ఆడాడు. 32 ఓవర్లు వేశాడు. 204 పరుగులు ఇచ్చాడు. 13 వికెట్లు పడగొట్టాడు. మొత్తం ఇప్పటివరకు అతడు 80 కి పైగా డాట్ బాల్స్ వేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తుషార్ దేశ్ పాండే తనదైన మ్యాజిక్ బౌలింగ్ వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ల జాబితాలో తుషార్ దేశ్ పాండే 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు అతడు ఏడు మ్యాచ్లు ఆడాడు. 26 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. 69 డాట్ బాల్స్ వేశాడు. ఆరు వికెట్లు పడగొట్టాడు. 216 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక ఈ జాబితాలో ట్రెన్ట్ బౌల్ట్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఇతడు ఏడు మ్యాచ్లు ఆడాడు. 24 ఓవర్లు వేశాడు. 117 పరుగులు ఇచ్చాడు. 7 వికెట్లు పడగొట్టాడు. 68 వరకు డాట్ బాల్స్ వేశాడు.