https://oktelugu.com/

Anchor Srimukhi : టీవీ షోలో ఇలాంటి పాడు పనులేంటి… యాంకర్ శ్రీముఖి ని ఏకిపారేస్తున్న నెటిజన్లు! వీడియో వైరల్

రాను రాను షోలు దిగజారిపోతున్నాయి అంటూ మండి పడుతున్నారు. శ్రీముఖి ని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా .. శ్రీముఖి ఓ బంపర్ ఆఫర్ కొట్టేసిందని న్యూస్ వైరల్ అవుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 23, 2024 / 09:47 PM IST

    Anchor Srimukhi

    Follow us on

    Anchor Srimukhi : యాంకర్ గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది శ్రీముఖి. ఆమె ఉందంటే సదరు షోలో రచ్చ మామూలుగా ఉండదు. ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది. స్మాల్ స్క్రీన్ పై ప్రసారమవుతున్న పలు షో లకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. అంతే కాకుండా ఒటీటీలో కూడా ఓ కామెడీ షో హోస్ట్ చేస్తుంది. అవకాశం దొరికినప్పుడు సినిమాలు చేస్తూ వెండితెరపై కూడా సందడి చేస్తుంది.

    అదే సమయంలో శ్రీముఖి పై విమర్శలు వస్తున్నాయి. ఓ షో లో ఆమె నిర్వహించిన ఫన్నీ టాస్క్ చాలా వల్గర్ గా ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి షో లు పిల్లలతో కలిసి ఎలా చూడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల షోస్ కాస్త శృతి మించుతున్నాయి. గేమ్స్ పేరుతో బుల్లితెర నటులతో హగ్గింగ్, కిస్సింగ్ వంటి వల్గర్ యాక్టివిటీస్ చేయిస్తున్నారు. ఇలాంటి ఒక గేమ్ శ్రీముఖి ఆడించింది.

    ఈ షోలో సీరియల్ ఆర్టిస్ట్ లు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ ఫన్నీ టాస్క్ ఆడించింది శ్రీముఖి. నటుడు రవికృష్ణ, మరో నటి ఈ గేమ్ లో పాల్గొన్నారు. రవికృష్ణ కుర్చీలో కూర్చుంటాడు. లేడీ ఆర్టిస్ట్ బెలూన్ తీసుకువచ్చి రవికృష్ణ ల్యాప్ లో పెట్టి దానిపై ఆమె కూర్చుని బెలూన్ పగలగొట్టాలి. ఈ గేమ్ చూడ్డానికి కాస్త వల్గర్ గా కనిపిస్తుండడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీవీ షోలో ఇలాంటి పాడు పనులేంటని, ఇలాంటి షో లు అసలు పిల్లలతో ఎలా చూసేది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    రాను రాను షోలు దిగజారిపోతున్నాయి అంటూ మండి పడుతున్నారు. శ్రీముఖి ని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా .. శ్రీముఖి ఓ బంపర్ ఆఫర్ కొట్టేసిందని న్యూస్ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ -అట్లీ కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీలో ఆమెకు అవకాశం దక్కిందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా పరివార్, నీతోనే డాన్స్ 2.0, ఆహా లో స్టాండప్ కామెడీ షో చేస్తుంది.

    https://twitter.com/Sagar4BJP/status/1782005373160783970?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1782005373160783970%7Ctwgr%5E8e82f2b71f4579b5a8452d1c45bdad048827364f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fstatic.asianetnews.com%2Ftwitter-iframe%2Fshow.html%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FSagar4BJP%2Fstatus%2F1782005373160783970%3Fref_src%3Dtwsrc5Etfw