Pan India Movies
Pan India Movies: ప్రభాస్ కల్కి తో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో ప్రభాస్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ రాజా సాబ్ మూవీ చేస్తున్నారు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల కానుంది.
కెజిఎఫ్ 2 అనంతరం గ్యాప్ తీసుకున్న యష్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కి ఛాన్స్ ఇచ్చాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ డ్రామాగా టాక్సిక్ తెరకెక్కుతున్నట్లు సమాచారం. టాక్సిక్ ఏప్రిల్ 10న విడుదల కానున్నట్లు సమాచారం. మరి అదే నిజమైతే రాజాసాబ్-టాక్సిక్ చిత్రాలు ఓకే తేదీన విడుదలవుతాయి. ప్రభాస్-యష్ బాక్సాఫీస్ వద్ద తలపడటం ఖాయంగా కనిపిస్తుంది.
2025లో విడుదలవుతున్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం వార్ 2. ఈ బాలీవుడ్ చిత్రంలో ఎన్టీఆర్ నటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నార్త్ తో పాటు సౌత్ ఆడియన్స్ వార్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ వార్ 2 ఆగస్టు 14న విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కింగ్ డమ్. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. సత్యదేవ్ కీలక రోల్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన కింగ్ డమ్ టీజర్ మైండ్ బ్లాక్ చేసింది. అంచనాలు పెంచేసింది. కింగ్ డమ్ మూవీ మే 30న విడుదల కానుంది.
2022లో విడుదలైన కాంతార ఒక సంచలనం. కేవలం 16-20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనికి ప్రీక్వెల్ గా కాంతార 2 తెరకెక్కుతుంది. రిషబ్ శెట్టి లుక్ ఆసక్తిరేపుతుంది. కాంతార 2 దసరా కానుకగా అక్టోబర్ నెలలో విడుదల కానుందని సమాచారం.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం దిల్ మద్రాసి. యాక్షన్ డ్రామా కాగా శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ మద్రాసి చిత్రంలో బిజూ మీనన్, విద్యుత్ జామ్వాల్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఈ ఏడాదే థియేటర్స్ లోకి రానుంది.