Maha Shivaratri
Maha Shivaratri: హిందూ ధర్మంలో మహా శివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది. హిందూ ప్రజలు శివరాత్రిని (Maha Shivaratri) ఎంతో భక్తితో పూజిస్తారు. మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా శివుడిని భక్తితో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరడంతో పాటు మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. మహా శివరాత్రి రోజు మొత్తం శివుడిని పూజించి ఉపవాసం ఆచరిస్తారు. అయితే ఈ ఏడాది మహా శివరాత్రిని (Maha Shivaratri) రేపు అనగా ఫిబ్రవరి 26వ తేదీన జరుపుకుంటున్నారు. మహా శివరాత్రిని లింగోద్భవ సమయంలోనే జరుపుకుంటారు. అంటే మాఘ బహుళ చతుర్థశి తిథి ఉండాలి. అయితే మహా శివరాత్రిని బుధవారం ఉదయం 9:47 నిమిషాల నుంచి తర్వాత రోజు ఫిబ్రవరి 27వ తేదీ గురువారం ఉదయం 8:41 నిమిషాల వరకు జరుపుకోవచ్చు. అయితే ఎక్కువ మంది బుధవారం మహా శివరాత్రిని ఆచరిస్తారు. అయితే మనలో చాలా మందికి మహా శివరాత్రి ఎలా జరుపుకుంటే పుణ్యం లభిస్తుందో సరిగ్గా తెలియదు. అయితే మహా శివరాత్రి రోజు శివుడిని ఎలా పూజిస్తే పుణ్యం వస్తుందో ఈ స్టోరీలో చూద్దాం.
హిందూ పురాణాల్లో మహా శివరాత్రికి ఓ ప్రత్యేకత ఉంది. అయితే ఈ మహా శివరాత్రిని ఒక రోజు ముందు నుంచే జరుపుకోవాలి. అంటే త్రయోదశి తిథి ఉన్నప్పటి నుంచి మహా శివరాత్రిని జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ తిథి నుంచే ఉపవాసం ఉంటేనే పుణ్యం లభిస్తుందని అంటున్నారు. అయితే ముందు రోజు నుంచి మాంసాహారం, ఉల్లిపాయకి దూరంగా ఉండాలి. అవసరం అయితే ఉపవాసం కూడా ఆచరించవచ్చు. అయితే మహా శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే లేవాలి. ఇంటిని శుభ్రం చేసుకుని నూతన దుస్తులు ధరించి పూజ చేయాలి. ముందుగా శివునికి షోడశోపచార పూజలు చేయాలి. ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసి శివాష్టోత్తర శతనామాలు చదవి మారేడు దళాలను సమర్పించి ఉపవాసం ఆచరించాలి. ఎలాంటి చెడు ఆలోచనలు మనస్సులో లేకుండా భక్తితో శివుడిని పూజించాలి. ఇంట్లో పూజ చేసిన తర్వాత సమీపంలోని శివాలయానికి వెళ్లి అభిషేకం చేయాలి. వీలైతే రుద్రాభిషేకం చేయిస్తే అంతా మంచే జరుగుతుంది. కేవలం ఉదయం పూట మాత్రమే కాకుండా సాయంత్రం పూట కూడా శివాలయానికి వెళ్లి అభిషేకం చేయాలి. ముఖ్యంగా ప్రదోష సమయంలో పూజ చేయడం వల్ల కోరికలు అన్ని నెరవేరతాయి.
శివరాత్రి రోజున శివాలయంలో ధ్యానం చేయండి. మనస్సులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కేవలం శివుడిని స్మరిస్తూ ధ్యానం చేయాలి. రోజంతా ఉపవాసం ఆచరించి, రాత్రంతా జాగరణ చేయాలి. తర్వాత రోజు స్నానం చేసి, శివుడిని దర్శించుకోవాలి. ఆ తర్వాతే ఉపవాసం విరమించి ఏదైనా తినాలి. ఇలా మహా శివరాత్రి పూజ చేయడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది. కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరతాయి. ఎలాంటి కష్టాలు కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.