https://oktelugu.com/

Suma: పండుగ పూట కూడా పాత మొగుడేనా.. ఆ షోలో సుమ రెచ్చిపోయిందిగా?

Suma: బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు వచ్చినా సుమను మించి క్రేజ్ ను సంపాదించుకున్న మరో యాంకర్ లేరనే చెప్పాలి. ఒకానొక దశలో ఈ ఛానల్ ఆ ఛానల్ అనే తేడాల్లేకుండా అన్ని ఛానెళ్లలో సుమ షోలు ప్రసారమయ్యాయనే సంగతి తెలిసిందే. 17 సంవత్సరాల క్రితం అవాక్కయ్యారా షోతో బుల్లితెరపై సుమకు భారీస్థాయిలో గుర్తింపు రాగా ఆ తర్వాత సుమ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదని చెప్పాలి. జీ తెలుగు ఛానల్ లో ఆదివారం రోజున […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 17, 2022 / 09:33 AM IST
    Follow us on

    Suma: బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు వచ్చినా సుమను మించి క్రేజ్ ను సంపాదించుకున్న మరో యాంకర్ లేరనే చెప్పాలి. ఒకానొక దశలో ఈ ఛానల్ ఆ ఛానల్ అనే తేడాల్లేకుండా అన్ని ఛానెళ్లలో సుమ షోలు ప్రసారమయ్యాయనే సంగతి తెలిసిందే. 17 సంవత్సరాల క్రితం అవాక్కయ్యారా షోతో బుల్లితెరపై సుమకు భారీస్థాయిలో గుర్తింపు రాగా ఆ తర్వాత సుమ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదని చెప్పాలి.

    జీ తెలుగు ఛానల్ లో ఆదివారం రోజున జీ సూపర్ ఫ్యామిలీ పేరుతో ఒక ఈవెంట్ ప్రసారం అవుతుండగా జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే సీరియళ్లు, రియాలిటీ షోలలో పాల్గొనే నటీనటులు ఈ షోకు గెస్టులుగా హాజరయ్యారు. ప్రోమోలో సుమ ఎంట్రీ ఇవ్వగా ప్రదీప్ సుమను మీరు ఫ్యామిలీతో వచ్చారా అని అడుగుతాడు.. ఆ ప్రశ్నకు సుమ పండుగ పూట కూడా పాత మొగుడేనా అంటూ కామెంట్ చేయడం గమనార్హం.

    సుధీర్ కు, ప్రదీప్ కు పెళ్లవ్వకుండా పెళ్లైన ప్రోమోలు ఎన్ని పడ్డాయో ఎన్ని నా కళ్లతో చూశానో అంటూ సుమ పంచ్ వేశారు. నిఖిల్ ఈ షోలోకి వాళ్ల అమ్మతో ఎంట్రీ ఇవ్వగా నిఖిల్ అమ్మ తాను ప్రిన్సిపాల్ గా పని చేశానని ఎవరికీ తెలియని విషయాన్ని వెల్లడించారు. నిఖిల్ కు చిన్నప్పుడు గౌను వేశామని, పిలకలు పెట్టామని చెబుతూ నిఖిల్ అమ్మ ఈ ఈవెంట్ లో షాకింగ్ సీక్రెట్లను రివీల్ చేశారు.

    సిద్ధు జొన్నలగడ్డ ఈ షోలో తన తల్లితో కలిసి ఎంట్రీ ఇచ్చారు. సిద్ధుకు స్పీడ్ ఎక్కువని ఏ పని చేసినా త్వరగా అయిపోవాలని చెప్పేవాడని ఆమె అన్నారు. అట్లుంటది మా అమ్మతోని అంటూ సిద్ధు జొన్నలగడ్డ షోలో తన డైలాగ్ తో అదరగొట్టారు. ఈ ప్రోమోకు ఏకంగా 9 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.