Telugu films in Oscars race: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి సినిమాలు చేసిన కూడా స్టార్ హీరోల సినిమాలకు ఇక్కడ మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్ళు సాధిస్తున్న విజయాలను బట్టి చూస్తుంటే ఇప్పుడు ఇండియాలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ లో ఉందనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సంవత్సరం వచ్చిన చాలా సినిమాలు తమదైన రీతిలో సత్తాను చాటుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకుంటున్నాయనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇండియాలో నేషనల్ అవార్డ్స్ రావడం ఎంత కీలకమో ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డులకు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకి కూడా ఆస్కార్ అవార్డు అయితే రాలేదు. ఇక ఇప్పుడు ఆస్కార్ అవార్డు కోసం పంపించే సినిమాల్లో తెలుగు నుంచి ఐదు సినిమాలు పోటీలో ఉండడం విశేషం…
అందులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ ఒకటి కాగా, వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ , మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘కన్నప్ప’, సుకుమార్ కూతురు సుకృత మెయిన్ లీడ్ లో నటించిన ‘గాంధీతాత చెట్టు’ అలాగే శేఖర్ కమ్ముల ధర్మకత్వంలో ధనుష్ హీరోగా వచ్చిన ‘కుబేర’ సినిమాలు ఉండటం విశేషం…
మరి ఈ ఐదు సినిమాలను ఆస్కార్ అవార్డుల కోసం పంపించడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కిన ఒక అరుదైన గౌరవం అనే చెప్పాలి. వీటిలో ఫైనల్ గా ఏ సినిమాలు ఆస్కార్ అవార్డు రేసులో నిలబడతాయి. ఏ సినిమాలకు ఆస్కార్ అవార్డు వస్తోందనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తంలో ఈ ఆస్కార్ అవార్డు లిస్టుల గురించే కామెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు లేనట్టుగా ఐదు సినిమాలు ఆస్కార్ అవార్డు రేసులో ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం…ఒక్కో సినిమా ఒక్కో జానర్ కి సంబంధించినది కావడం విశేషం…