BIG Relief To Subbarami Reddy: మనదేశ వ్యవస్థలు పలుకుబడి ఉన్న వారి విషయంలో ఒక విధంగా.. బలహీనుల విషయంలో మరొక విధంగా పనిచేస్తుంటాయి. ఇది అనేక సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. మనం ఏదైనా అప్పు తీసుకుంటే లేదా పొరపాటున తప్పు చేస్తే బ్యాంకులు ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తుంటాయి. వడ్డీల మీద వడ్డీలు వేసి నరకం చూపిస్తుంటాయి. కొన్ని సందర్భాలలో ఏకంగా ఆస్తులను కూడా జప్తు చేస్తుంటాయి. కానీ ఇవే బ్యాంకులు పెద్దల విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరిస్తుంటాయి. అప్పు తీసుకుని, చెల్లించకపోయినా రైట్ రైట్ అంటూ వదిలేస్తుంటాయి. అలాగని ఆ బ్యాంకులు పది వేలో, లక్షో కాదు.. ఏకంగా కోట్ల కోట్లే మాఫీ చేస్తుంటాయి.
తెలుగులో సుప్రసిద్ధ రాజకీయ నాయకుడిగా.. సినీ నిర్మాతగా సుబ్బిరామిరెడ్డి సుపరిచితులు. కాంగ్రెస్ పార్టీలో ఉండగానే సుబ్బిరామిరెడ్డి గాయత్రి ప్రాజెక్ట్స్ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ అనేక పనులు చేపట్టింది. మొదట్లో వ్యాపార లావాదేవీలు బాగానే ఉండేవి. ఆ తర్వాత కంపెనీ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఆర్థికంగా కష్టాలు వచ్చాయి. చేతిలో ఉన్న ప్రాజెక్టులు పోయాయి. అప్పుడు ఇచ్చిన బ్యాంకులు నోటీసుల మీద నోటీసులు ఇచ్చాయి. చివరికి గాయత్రి ప్రాజెక్ట్స్ అన్ని మూసుకోవాల్సి వచ్చింది.
గాయత్రి ప్రాజెక్ట్స్ కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకులకు దాదాపు 8,100 కోట్లను చెల్లించాల్సి ఉండేది. అయితే వీటిని చెల్లించడంలో గాయత్రి ప్రాజెక్ట్స్ విఫలమైంది. ఈ నేపథ్యంలో 2022లో ఈ కంపెనీ జాతీయ కంపెనీ లార్డ్ ట్రైబ్యునల్ లో దివాలా పిటిషన్ వేసింది. అయితే ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి ఏదీ ముందుకు రాలేదు. దీంతో సుబ్బిరాం రెడ్డి కుటుంబం వన్ టైం సెటిల్మెంట్ కింద 2,400 కోట్లను చెల్లిస్తామని చెప్పింది. దీనిని నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ ఒప్పుకుంది. ఫలితంగా గాయత్రి ప్రాజెక్ట్స్ కు 5,700 కోట్ల రుణం మొత్తం మాఫీ అయింది. గాయత్రి కంపెనీని కొనుగోలు చేయడానికి ఏ కంపెనీ కూడా ముందుకు రాకపోవడంతో.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సింగల్ టైం సెటిల్మెంట్ ఇచ్చింది. దీంతో 2400 కోట్లను చెల్లించడానికి సుబ్బి రామిరెడ్డి కుటుంబం ముందుకు వచ్చింది. వాస్తవానికి ఇంత మొత్తంలో అప్పులు మాఫీ చేయడం పట్ల మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. మనదేశంలో సామాన్యుల విషయంలో అత్యంత దారుణంగా వ్యవస్థలు పనిచేస్తుంటాయని.. అదే పెద్దల విషయంలో మాత్రం సాగిల పడిపోతుంటాయని.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఆర్థిక నేరగాళ్లు తీసుకున్న అప్పును చెల్లించలేదని.. కొంతమంది వేలకోట్లు అప్పు తీసుకున్నప్పటికీ.. అందులో పావు వంతు మాత్రమే చెల్లిస్తున్నారని.. పేదవారి విషయంలో బ్యాంకులు ఇలా వ్యవహరించగలవా అంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు.