Oosaravelli: ఊసరవెల్లి సినిమా ప్లాప్ కి 4 కారణాలు ఇవే…

ఎన్టీఆర్ సినిమాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ సినిమా టాపిక్ అయితే వస్తుంది. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసినప్పటికీ ఈ సినిమాలో ఏదో ఒక డిఫాల్ట్ అనేది ఉండటం వల్ల సినిమా అనేది ప్లాప్ అయింది.

Written By: Gopi, Updated On : December 6, 2023 1:03 pm

Oosaravelli

Follow us on

Oosaravelli: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఊసరవెల్లి సినిమా కాన్సెప్ట్ పరంగా కానీ, విజువల్ గా కానీ బాగుంటుంది. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.ఈ సినిమా ఎందుకు ప్లాప్ అయిందనేది ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే చాలామంది ఇప్పటికీ కూడా సినిమా చాలా బాగుంటుంది అయినప్పటికీ ఎందుకు ఫెయిల్ అయింది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ సినిమా టాపిక్ అయితే వస్తుంది. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసినప్పటికీ ఈ సినిమాలో ఏదో ఒక డిఫాల్ట్ అనేది ఉండటం వల్ల సినిమా అనేది ప్లాప్ అయింది. అయితే ఆ డిఫాల్ట్ ఏంటి అనేది ఎవరికి తెలియడం లేదు. ముఖ్యంగా ఆ డిఫాల్ట్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ సినిమా ఫ్లాప్ కి ముఖ్యంగా నాలుగు కారణాలు ప్రధానంగా చెప్పుకోవాలి అవి ఏంటి అంటే…

ఒకటి ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అంత ఇంపాక్ట్ ని చూపించకపోగా, తమన్నా క్యారెక్టర్ కి స్పేస్ ఎక్కువ ఉన్నప్పటికీ ఆ క్యారెక్టర్ లో క్లారిటీ అనేది చాలా వరకు మిస్ అయింది.డైరెక్టర్ ఆ క్యారెక్టర్ ని ఇంకా డిటేల్ గా రాసుకొని ఉంటే బాగుండేది. అందువల్లే ఈ సినిమా అనేది ఒక వర్గం ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు…

ఇక రెండో కారణం ఏంటి అంటే అప్పటివరకు ఎన్టీఆర్ సినిమాలు ఒక ఎత్తు అయితే ఊసరవెల్లి సినిమా అనేది మరొక ఎత్తు అయింది. ఇక అప్పటివరకు ఎన్టీఆర్ మీదనే సినిమా స్టోరీలు వచ్చేవి కానీ ఈ సినిమా ఒక లేడీ స్టోరీ కావడం అందులోకి హీరో ఎంటర్ అవడం అంటే ఇక్కడ హీరోకి అంత పెద్ద స్కోప్ లేదు. అంతకు ముందు ఆయన చేసిన అన్ని సినిమాల్లో ఆయనకి ఒక పవర్ ఫుల్ రోల్ అనేది ఉండేది. కథ మొత్తం ఆయన మీదే నడిచేది కానీ ఈ సినిమాలో అలా కాదు హీరోయిన్ కథలోకి హీరో ఎంటర్ అవుతాడు దానివల్ల అప్పుడున్న ప్రేక్షకుల మిండ్ సెట్ కి ఎన్టీయార్ అభిమానులు అంతకు ముందు చూసిన ఆయన సినిమాకి ఆ స్టోరీని జీర్ణించుకోలేకపోయారు. అందువల్లే వాళ్లకి ఆ సినిమా ఎక్కలేదు…

ఇక డైరెక్షన్ పరంగా ఈ సినిమా బాగున్నప్పటికీ కొన్ని రివర్స్ స్క్రీన్ ప్లే షాట్స్ అనేది వర్కవుట్ అవ్వలేదు. సురేందర్ రెడ్డి ఎప్పుడు చేసినా తన సినిమాలో రివర్స్ స్క్రీన్ ప్లే ని ఎక్కువగా వాడుతూ ఉంటాడు.ఇక ఇక్కడ రివర్స్ స్క్రీన్ ప్లే చేయడం వల్లే కొన్ని సీన్లు బోరింగ్ గా నడిచాయి. మధ్యలో కొంతమంది అభిమానులు అయితే సినిమా అయిపోతే బాగుండు బయటికి వెళ్లి పోదాం అని అనుకునేంత బోరింగ్ తెప్పించాయి. అందువల్లే ఈ సినిమా ఫ్లాప్ కి ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక ఈ ఫ్లాప్ తోనే సురేందర్ రెడ్డి రివర్స్ స్క్రీన్ ప్లే అనేది అన్ని వేల వర్కౌట్ అవ్వదు అని తెలుసుకొని తన తదుపరి సినిమాల్లో రివర్స్ స్క్రీన్ ప్లే ని పక్కనపెట్టి నార్మల్ స్ట్రైయిట్ వే లోనే కథ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు…

ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు మహేష్ బాబు దూకుడు సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకొని సక్సెస్ ఫుల్ సినిమాగా ముందుకు దూసుకుపోతుంది. ఇక అలాంటి సమయంలో ఈ సినిమా రిలీజ్ అయి డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో దూకుడు సినిమా ఆల్రెడీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతు ఉండటం తో ప్రేక్షకులందరు ఆ సినిమా వైపే మొగ్గు చూపారు.దాంతో ఈ సినిమా అనేది కొంతవరకు డల్ అయింది. ఊసరవెల్లి సినిమాలో ఇలాంటి తప్పిదాలు లేకపోయి ఉంటే ఈ సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అయ్యేది…