https://oktelugu.com/

Karthika Deepam: అక్కడ మోనిత.. ఇక్కడ రుద్రాణి.. ఇక ఈ కుటుంబానికి సంతోషాలే లేవా?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. మోనిత సౌందర్య వాళ్ళ ఇంట్లో పూజ చేసి అందరికీ హారతి ఇవ్వడానికి దగ్గరికి వెళుతుంది. ఇక ఎవరు కూడా మోనితను లెక్క చేయరు. అయినా మోనిత ఓవర్ గా ప్రవర్తించడంతో ఆదిత్య తనపై కోపంతో రగిలిపోతాడు. శ్రావ్య ఆదిత్యను తన దగ్గరికి వెళ్లొద్దని పదే పదే చెబుతోంది. ఓపిక నశించిన సౌందర్య మోనితపై అరుస్తుంది. ఇలా ఎందుకు చేస్తున్నావు అంటూ తనను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 16, 2021 / 12:57 PM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. మోనిత సౌందర్య వాళ్ళ ఇంట్లో పూజ చేసి అందరికీ హారతి ఇవ్వడానికి దగ్గరికి వెళుతుంది. ఇక ఎవరు కూడా మోనితను లెక్క చేయరు. అయినా మోనిత ఓవర్ గా ప్రవర్తించడంతో ఆదిత్య తనపై కోపంతో రగిలిపోతాడు. శ్రావ్య ఆదిత్యను తన దగ్గరికి వెళ్లొద్దని పదే పదే చెబుతోంది.

    Karthika Deepam

    ఓపిక నశించిన సౌందర్య మోనితపై అరుస్తుంది. ఇలా ఎందుకు చేస్తున్నావు అంటూ తనను గట్టిగా నిలదీస్తుంది. ఇక మోనిత కూడా అంతే గట్టిగా సమాధానం ఇస్తుంది. నా బిడ్డను నాకు ఇవ్వాలని అంటూ నా బాబు ఈ ఇంటి వారసుడు అంటూ సౌందర్య వాళ్లను రెచ్చగొట్టే మాటలతో మాట్లాడుతుంది మోనిత. సౌందర్య వాళ్ళు మోనిత మాటలకు ఏమి అనలేక బాధపడుతూ ఉంటారు.

    Also Read: భర్త వదిలేశాక, పాత బంధంలోకి స్టార్ హీరోయిన్ !

    కార్తీక్ ఇంటి బయట కూర్చొని రుద్రాణి చేసిన సంఘటనను తలుచుకుంటాడు. అప్పుడే దీప వచ్చి రుద్రాణి గురించి ఆలోచించకండి అంటూ సంతోషంగా ఉండాలి అని చెబుతుంది. కానీ కార్తీక్ మాత్రం ధైర్యంగా ఉండటం ఎలా అని బాధపడతాడు. దీప మాత్రం నేను చూసుకుంటాను అని మిమ్మల్ని సంతోషంగా ఉంచే బాధ్యత నాది అంటూ తెలుపుతుంది. ఇక ఈ రోజు స్కూల్లో వంటలు చేయడానికి వెళుతున్నాను అని సంతోషంగా చెబుతుంది.

    మరోవైపు మోనిత తన మెత్తని మాటలతో ఆనందరావు ని తన ఆధీనంలో పెట్టుకోవాలని చూస్తుంది. ఇక రుద్రాణి కార్తీక్, దీప లపై మరింత పగ పెంచుకుంటుంది. వాళ్లని ఏదైనా చేయాలి అని అనుకుంటుంది. ఇక దీప పని చేయటానికి స్కూల్ దగ్గరికి వెళ్లడంతో తనను ఉద్యోగంలోకి తీసుకోవద్దని రుద్రాణి చెప్పిందని స్కూల్ మేడమ్ చెప్పటంతో దీప మరో మాట అనకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. మొత్తానికి అక్కడ మోనిత ఇక్కడ రుద్రాణి దీప కుటుంబంపై పగ పెంచుకుంటూనే ఉన్నారు. సంతోషాలు లేకుండా చేస్తున్నారు.

    Also Read: ఆ నీలి చిత్రాల మరకల్లో నష్టపోయింది ఆమె మాత్రమే !