https://oktelugu.com/

Arjuna Phalguna: శ్రీవిష్ణు ‘అర్జున ఫాల్గుణ’ సినిమా విడుదల తేదీ ఖరారు

Arjuna Phalguna: విభిన్న పాత్రలు,  వినూత్న కథలతో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా ఇప్పుడు మరొకసారి డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఈ యంగ్ హీరో. శ్రీ విష్ణు హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అర్జున ఫల్గుణ. ఈ మూవీకి  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తేజ మర్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన […]

Written By: , Updated On : December 16, 2021 / 12:49 PM IST
Follow us on

Arjuna Phalguna: విభిన్న పాత్రలు,  వినూత్న కథలతో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న హీరో శ్రీ విష్ణు. తాజాగా ఇప్పుడు మరొకసారి డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఈ యంగ్ హీరో. శ్రీ విష్ణు హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అర్జున ఫల్గుణ. ఈ మూవీకి  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తేజ మర్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్​.. సోషల్​మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది.

Arjuna Phalguna

Arjuna Phalguna

అయితే, తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. 2021లోనీ శ్రీవిష్ణు థియేటర్లలో సందడి చేయనున్నారు. డిసెబంరు 31న థియేటర్లలో ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ సిద్ధమయ్యారు.

Also Read: ఆ హీరో ఫెయిల్యూర్ కి కారణం అతనే !

ఈ మేరకు శ్రీవిష్ణు, అమృత అయ్యర్​, జబర్దస్త్ మహేశ్​ తదితరులు గోనెసంచిలో ఏదో చూసి ఆశ్చర్యపోటినట్లు ఓ పోస్టర్​ను విడుదల చేస్తూ.. సినిమా రిలీజ్​ డేట్​ను ప్రకటించారు. మరోవైపు కీర్తి సురేశ్ నటించిన గుడ్​లక్​ సఖి సినిమా కూడా అదే రోజు విడుదల కానుంది. దీనికి తోడు రానా నటించిన 1945 సినిమా కూడా డిసెంబరు 31నే రానుంది. ఇన్ని సినిమాలు ఒకే రోజు రావడంతో పోటీ గట్టిగా నెలకొన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు అఖండ సినిమా ఘన విజయంతో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారనే నమ్మకం కెలిగింది. దీంతో ఇండస్ట్రీలో కొత్త ఆశలు చిగురించాయి. ఈ క్రమంలోనే రిలీజ్​ డేట్​ ఎక్కువ సమయం లేనందున ఇప్పటినుంచే ప్రమోషన్స్ ప్రారంభించింది అర్జున ఫాల్గుణ టీమ్​.

Also Read: చిరుకి ఏమైంది ? వారికెలా ఛాన్స్ ఇస్తున్నాడు ?