Sivaji Controversial Remarks: ప్రముఖ నటుడు శివాజీ(Sivaji) రీసెంట్ గా ‘దండోరా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ వేసుకునే దుస్తుల గురించి మాట్లాడిన మాటలు పెను దుమారం రేపాయి. చీరలోనే అందం ఉంటుంది కానీ, సామాన్లు కనిపించేలా వేసుకునే దుస్తుల్లో కాదు, మిమ్మల్ని చూసి ప్రేక్షకులు దొంగ ముం**,ఇలాంటి బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఏంటి, చక్కగా చీర కట్టుకోవచ్చు కదా అని అంటున్నారు అంటూ శివాజీ మాట్లాడాడు. దీన్ని సినీ ఇండస్ట్రీ కి చెందిన మంచు మనోజ్, మంచు లక్ష్మి, చిన్మయి, యాంకర్ అనసూయ వంటి వారు కూడా స్పందించి, శివాజీ చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. అయితే శివాజీ తానూ మాట్లాడిన తప్పుడు మాటలకు క్షమాపణలు చెప్తూ నిన్న ఒక వీడియో ని విడుదల చేసాడు. ఆయన వీడియో ని విడుదల చేసిన తర్వాత మహిళా కమీషన్ నుండి నోటీసులు వచ్చాయి.
అయితే నేడు ఏర్పాటు చేసిన దండోరా మూవీ ప్రెస్ మీట్ లో శివాజీ మరోసారి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను అలా మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, లుల్లూ మాల్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ పడిన వేదన, తాను కారులోకి ఎక్కినా తర్వాత ఎంత బాధకు గురైందో, సంఘటన జరిగి వారం రోజులు దాటినా నా మైండ్ లో నుండి పోలేదు. ఆ తర్వాత వెంటనే సమంత గారికి కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. నేను ఈ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత 90 శాతం మంది లేడీ ఆర్టిస్టులు ఎప్పుడూ కూడా వాళ్ళు వేసుకునే దుస్తులను షాప్స్ లో అమ్మేసేవారు. రమ్య కృష్ణ, శ్రీదేవి,. విజయశాంతి వంటి హీరోయిన్స్ కి ఇలాంటివి గతం లో మనం చాలానే చూసాము. నేను ఎవ్వరినీ కూడా ఇలాంటి బట్టలు వేసుకోండి , అలాంటి బట్టలు వేసుకోండి అని చెప్పలేదు, అలా చెప్పడానికి నేను ఎవరిని?’.
‘సమాజం లో ఏ రుగ్మత వచ్చినా కానీ, మీ సినిమా ఇండస్ట్రీ వల్లే ఇలా తయారయ్యారు అంటూ నిందిస్తున్నారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను, సినీ ఇండస్ట్రీ ఇచ్చిన డబ్బులతోనే నా కుటుంబాన్ని పోషించాను, అలాంటి ఇండస్ట్రీ పై ఎవ్వరూ వేలు ఎత్తి చూపించకూడదు అనే ఆలోచనతోనే నేను ఆ సందర్భం లో అలా మాట్లాడాల్సి వచ్చింది. నేను ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు కాదు, ఈ విషయం లో నేను ఎవరికీ భయపడను, అసలు తగ్గేది లేదు. కానీ నేను ఉపయోగించిన ఆ రెండు పదాలు మాత్రం చాలా తప్పు, నా భార్య పిల్లలు కూడా అందుకు చాలా ఫీల్ అయ్యారు. ఆ రెండు పదాలకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ.
ఇచ్చిన స్టేట్మెంట్ కి మాత్రం కట్టుబడే ఉన్నా… ఎవరికీ భయపడేది లేదు…
ఆ రెండు పదాలు మాత్రమే… #Sivaji pic.twitter.com/qGChLSuhyl
— M9 NEWS (@M9News_) December 24, 2025