Anasuya: నన్ను ఆంటీ అంటారా అని నొచ్చుకుంటున్న అనసూయ ఘాటైన అందాలతో సమాధానం చెప్పింది. ఓ వైపు గొడవ జరుగుతుండగా హాట్ ఫోటో షూట్ వదిలింది. విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది. నడుము, నాభీ చూపిస్తూ టెంప్ట్ చేసింది. అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ కాగా… టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.
అనసూయ వివాదం ముందు స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలు కూడా సోషల్ మీడియాలో మరుగున పడిపోయాయి. మూడు రోజులుగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వర్సెస్ అనసూయ అన్నట్లు సాగుతుంది. ఈ ప్రత్యర్థి వర్గాలు అసలు తగ్గేది లేదంటూ వాదోపవాదాలకు దిగారు. అనసూయని ఆంటీ అంటూ ట్రోల్స్, మీమ్స్ తో విరుచుకుపడుతుండగా, అనసూయ వాళ్ళ కామెంట్స్ ని తెలివైన సమాధానాలతో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది.
విజయ్ దేవరకొండ లైగర్ ఫ్లాప్ ని ఎంజాయ్ చేస్తున్నానని ఒప్పుకున్న అనసూయ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. అక్కడ మొదలైన వివాదం ఇంకా కొనసాగుతుంది. తమ హీరోని అనసూయ ఇన్సల్ట్ చేశారని భావిస్తున్న అభిమానులు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తనను ట్రోల్ చేసిన వారిపై కేసు పెట్టినట్లు అనసూయ చెప్పడం విశేషం. వాళ్ళను వదిలేదని ఆమె భీష్మించుకు కూర్చున్నారు.
Also Read: Rohit Sharma- Kohli: కోవిడ్ తర్వాత కోహ్లీ మానసిక ఆరోగ్యంపై రోహిత్ శర్మ హాట్ కామెంట్స్
అనసూయ జబర్దస్త్ షోలో ఎంజాయ్ చేసిన బూతు జోకుల కంటే విజయ్ దేవరకొండ మాట్లాడిన మాదర్** పెద్ద బూతు కాదని ఆయన ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అలాగే బుల్లితెరపై పొట్టి బట్టలు వేసుకుని స్కిన్ షో చేసే నీకు ఇవన్నీ అవసరమా అనేది వారి థీయరీ. ట్రోలర్స్ ఏమడిగినా అనసూయ వద్ద ఓ సమాధానం ఉంది. ఆమె తనని తాను సమర్థించుకుంటున్నారు.
ఇక అనసూయకు మద్దతుగా వచ్చిన శ్రద్దా దాస్ సైతం ట్రోల్స్ కి గురయ్యారు. అనసూయ చాలా అందంగా ఉంటుంది. తన వయసులో సగం ఉన్న అమ్మాయిల కంటే, డబుల్ ఏజ్ ఉన్న అంకుల్స్ కంటే హాట్ గా ఉందంటూ ఆమె ట్వీట్ చేశారు. అనసూయను పొగుడుతూ, విజయ్ ఫ్యాన్స్ ని విమర్శిస్తున్నట్లు ఆ ట్వీట్ వాళ్లను ఆగ్రహానికి గురి చేసింది.
ఇక ఆంటీ హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ కావడం విశేషం. కాగా ఎప్పుడో 2017లో జరిగిన వివాదాన్ని అనసూయ తెరపైకి తేవాల్సిన అవసరం ఏమిటనేది అనసూయను కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది ఆమె చేసిన పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వివాదంతో ట్రోలర్స్ కి కావాల్సినంత స్టఫ్ ఇచ్చింది అనసూయ.
Also Read:AP Police: గొంతెత్తిన వారిపై ‘నాలుగో సింహం’ ప్రతాపం.. ఏపీలో అ‘న్యాయ’రోదన