https://oktelugu.com/

Nandamuri family: నందమూరి ఫ్యామిలీలో ఎన్టీయార్ ను మించిన నటుడు లేరా..?

కళ్యాణ్ రామ్ కూడా అడపదడపా హిట్స్ తో టైర్ టు హీరోగా ముందుకు సాగుతున్నాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే స్టార్ హీరో గా మారి, మూడోవ తరం నందమూరి ఫ్యామిలీ బాధ్యతల్ని తన భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకెళ్తూన్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 6, 2024 / 05:33 PM IST
    Follow us on

    Nandamuri family: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ మరే ఫ్యామిలీకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఈ ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. అయితే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫెడౌట్ అయిపోయారు. ముఖ్యంగా బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాంటి నటులు మాత్రమే ఇక్కడ స్టాండర్డ్ గా నిలబడ్డారు.

    కళ్యాణ్ రామ్ కూడా అడపదడపా హిట్స్ తో టైర్ టు హీరోగా ముందుకు సాగుతున్నాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే స్టార్ హీరో గా మారి, మూడోవ తరం నందమూరి ఫ్యామిలీ బాధ్యతల్ని తన భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకెళ్తూన్నాడు. నిజానికి ఎన్టీఆర్ ను మినహాయిస్తే ఆ ఫ్యామిలీలో సరైన హీరో ఒక్కరు కూడా లేరనే చెప్పాలి. బాలయ్య బాబు స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ ఆయన సీనియర్ హీరోగా మారిపోయాడు. కాబట్టి ఇపుడున్న నందమూరి హీరోలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ని దాటి స్టార్ డమ్ ను సంపాదించుకునే పరిస్థితి అయితే లేదు. ఇక బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడని దాదాపు 5 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నప్పటికీ ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో ఇంకా ఇప్పటివరకు కూడా క్లారిటీ అయితే రాలేదు.

    దాంతో ఇక నందమూరి ఫ్యామిలీ ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడి మీదే ఉందని ఇప్పటికే చాలా మీడియా సంస్థలు కూడా అధికారికంగా వార్తలను రాస్తున్నాయి. నిజానికి సినిమా పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమైపోయింది. ఇక ఎన్టీఆర్ లాంటి నటుడు కూడా నందమూరి వంశంలో లేరనే చెప్పాలి.

    ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఎలా అయితే ఒక పాత్రను అలవోకగా చేసి మెప్పించేవాడో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన రీతిలోనే ప్రతి పాత్ర లో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి న్యాయం చేయడంలో తన పూర్తి ఎఫర్ట్ పెడతాడు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అదే తనని ఇండస్ట్రీలో ఒక దిగ్గజ నటుడిగా నిలబెట్టింది…