Director Radha Krishna: ఒక్క ఫ్లాప్ అగాధంలోకి నెట్టేయగలదు. పదుల సంఖ్యలో హిట్ ఇచ్చిన దర్శకులు కూడా ఓ అట్టర్ ప్లాప్ మూవీతో కృంగిపోయారు. అలాంటి ఫ్లాప్ కెరీర్ బిగినింగ్ లోనే పడితే ఏమైనా ఉంటుందా! దర్శకుడు సుజీత్ ఇలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. సాహో విడుదలై మూడేళ్లు అవుతున్నా సుజీత్ కి మరో ఆఫర్ రాలేదు. రన్ రాజా రన్ మూవీతో డైరెక్టర్ గా మారిన సుజీత్ రెండో సినిమాతోనే భారీ ప్రాజెక్ట్ భుజాలకెత్తుకున్నాడు. బాహుబలి సిరీస్ తో వేలకోట్ల వసూళ్లు సాధించిన ప్రభాస్ ఇమేజ్ ని ఫేస్ చేసే ధైర్యం చేశాడు. సాహో చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.
ఈ మూవీపై హైప్ ఎంతగా పెరిగిందంటే… రజనీకాంత్ కబాలి ని కూడా మించిపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. హిందీలో హిట్ కొట్టిన సాహో తెలుగులో అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్లాప్ టాక్ లో కూడా సాహో రూ. 450 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. సాహో ఫలితం సుజీత్ ని తొక్కేసింది. ఆయనకు అవకాశాలు రాకుండా చేసింది. లూసిఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు చిరంజీవి సుజీత్ కి అప్పగించారు. దీంతో గాడ్ ఫాదర్ ఛాన్స్ సుజీత్ తనదే అనుకున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక సుజీత్ ని పక్కనపెట్టి మోహన్ రాజాకు దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు.
Also Read: Money Bags In Beggar Room: యాచకుడి హఠాన్మరణం.. ఇంట్లొ నోట్ల కట్టలు
ఉన్న ఒక్క ఆశ కూడా పోగా సుజీత్ హీరోల చుట్టూ తిరుగుతున్నారు. కొంతలో కొంత సాహో లాంటి బెటర్ మూవీ తీసిన సుజీత్ పరిస్థితే ఇలా ఉంటే.. డిజాస్టర్ ఇచ్చిన రాధాకృష్ణ పరిస్థితేంటి అనే చర్చ మొదలైంది. సుజీత్ లాగే రెండో ప్రయత్నంలోనే ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ చేసే ఛాన్స్ రాధాకృష్ణకు దక్కింది. రాధే శ్యామ్ చిత్రాన్ని పీరియాడిక్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ మూవీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అత్యధిక నష్టాలు మిగిల్చిన టాలీవుడ్ చిత్రాల జాబితాలో చేరింది.
ఈ క్రమంలో రాధా కృష్ణ సైతం సుజీత్ మాదిరి కష్టకాలం ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. స్టార్స్ తో ఛాన్స్ అటుంచితే టూ టైర్ హీరోలు అవకాశం ఇవ్వడం గగనమే. రాధా కృష్ణ ఫస్ట్ మూవీ జిల్. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా చెప్పుకోదగ్గ విజయం సాధించకున్నా… ప్రభాస్ అవకాశం ఇచ్చాడు. ఓ మంచి సినిమా తీసే ప్రయత్నంలో విఫలం చెందాడు. ప్రభాస్ ఇమేజ్ కూడా రాధే శ్యామ్ పరాజయానికి ఓ కారణం. ప్రభాస్ లాంటి మాస్ హీరోకి లవ్ జోనర్ సెట్ కాలేదని చెప్పాలి.
Also Read:Richa Gangopadhyay: ఆ స్టార్ హీరో వల్లే సినీ ఇండస్ట్రీని వదిలేసిన హీరోయిన్ రిచా?