Chakravakam: బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ చక్రవాకం. అప్పట్ల అది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది 2003 నవంబర్ లో మొదలైన ఇందులో నటించిన నటీనటుల గురించి తెలియని వారుండరు. అంతటి ఘనత సాధించిన సీరియల్ అంటే అందరికి మక్కువే. తెలుగు వారి ఇళ్లల్లో సందడి చేసిన చక్రవాకం ఓ రికార్డు నమోదు చేసింది. దీంతో చక్రవాకం కొంత కాలం పాటు రంజింపజేసింది. పది కాలాలపాటు తెలుగువారికి దగ్గరైంది. అందులోని పాత్రలు కూడా అందరికి సుపరితమే.
చక్రవాకంలో హీరోగా నటించిన ఇంద్రనీల్ స్వస్థలం గుడివాడ. అదే సీరియల్ లో నటించిన మేఘనా రమ్మీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చక్రవాకం దర్శకురాలు మంజులా బిందు నాయుడు ఓ చరిత్ర సృష్టించింది. ఇంద్రనీల్ వర్మ అలియాస్ రాజేశ్ బాబుగా అందరికి పరిచయమై తరువాత కాలంలో కూడా మొగిలిరేకులు సీరియల్ లో నటించారు. పలు ప్రోగ్రాముల్లో కూడా ఈ జంట కనువిందు చేసింది. ఇందులో హీరోయిన్ గా నటించిన ప్రీతి అమిన్ ముంబై వాసి. ఆమె హిందీతో పాటు తెలుగు సీరియళ్లలో కూడా నటించి మెప్పించింది. అమెరికాకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయింది.
Also Read: Director Radha Krishna: రాధాకృష్ణకు కూడా సుజీత్ పరిస్థితేనా?
మరో నటుడు సెల్వరాజ్. ఇతడు ఇక్బాల్ గా నటించి అందరిని మెప్పించాడు. తరువాత మెగలిరేకులు సీరియల్ లో కూడా నటించాడు పలు ప్రోగ్రాముల్లో బిజిగా ఉన్నాడు. మరో్ నటి నిఖిత తెలుగమ్మాయి. ఈమె కూడా సీరియళ్లలో బిజీగా అయిపోయింది. తరువాత పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయింది. ఆమెకు ఓ బాబు కూడా ఉన్నాడు. చక్రవాకం సీరియల్ లో నటించిన వారికి గుర్తింపు మాత్రం దక్కింది.
మరోనటి శృతి. ఈమె మోడలింగ్ నుంచి సీరియల్ కు వచ్చింది. చక్రవాకం, మొగలిరేకులు, చంద్రముఖి, రుతురాగాలు, శ్రావణ సమీరాలు తదితర సిరియళ్లలో నటిస్తూ బిజీగా మారింది. సీరియల్ నటుడైన మధుసూదన్ ను వివాహం చేసుకుని ఇద్దరు సీరియళ్లలో నటిస్తున్నారు. అటు బుల్లితెర ఇటు వెండితెర ల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇద్దరు కలిసి నటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. తమదైన నటనతో సీరియళ్లక వన్నె తెస్తున్నారు.
చక్రవాకం, మొగలి రేకులు సీరియళ్ల ద్వారా మంచి గుర్తింపు పొందిన నటుడు సాగర్. బుల్లితెరతో పాటు వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిద్ధార్థ, షాదీ ముబారక్ సినిమాల ద్వారా తలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనలోని నటనతో అందరి ప్రశంసలు పొందాడు. ఇటు సీరియళ్లు అటు సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. భవిష్యత్ లో కూడా మరిన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.
చక్రవాకంతో కెరీర్ ప్రారంభించిన మరో నటి లహరి కూడా దూసుకుపోతోంది. మొగలిరేకులు, ముద్దుబిడ్డ, శుబాకాంక్షలు, ఆరాధన, లయ, డాక్టర్ చక్రవర్తి వంటి సీరియళ్లో నటిస్తోంది. వెండితెర మీద కూడా నటించి తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది. దీంతో చక్రవాకం ఎందరో నటులకు లైఫ్ ఇచ్చింది. అందులో నటించిన వారికి ఎన్నో అవకాశాలు దరి చేరాయి. ఈ నేపథ్యంలో వారు తమ కరీర్ ను తీర్చిదిద్దుకుంటున్నారు.
Also Read:Richa Gangopadhyay: ఆ స్టార్ హీరో వల్లే సినీ ఇండస్ట్రీని వదిలేసిన హీరోయిన్ రిచా?