Tollywood Heroes: సౌత్ హీరోల స్థాయి చిన్నది అంటూ హిందీ హీరోలు మొన్నటి వరకు నానా హడావుడి చేశారు. అయితే, ప్రస్తుతం తెలుగు హీరోలు ముఖ్యంగా ప్రభాస్. ఎన్టీఆర్, చరణ్ ల స్థాయి బాలీవుడ్ వరకూ పాకింది. ఇప్పుడు, హిందీ నిర్మాతల చూపు ఎన్టీఆర్ వైపు ఉంది. మంచి కథలు పడితే.. ఎన్టీఆర్ పై బాగా వర్కౌట్ అవుతుంది అని బాలీవుడ్ గ్రహించింది.

హిందీలో షారుఖ్, సల్మాన్ ఖాన్ లు పెద్ద స్టార్స్. వారి తర్వాత ప్లేస్ లో ఉంటాడు అమీర్ ఖాన్. కానీ.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన సినిమా దంగల్. పైగా భారీ కలెక్షన్స్ హీరోగా అమీర్ కి మంచి పేరు ఉంది. కారణం.. అమీర్ ఖాన్ మంచి నటుడు. ఎన్టీఆర్ కూడా ఆ స్థాయి నటుడు. కాబట్టి.. ఎన్టీఆర్ తో భారీ చిత్రాలతో పాటు వైవిధ్యమైన చిత్రాలు కూడా చెయ్యొచ్చు అనేది బాలీవుడ్ దర్శకనిర్మాతల ఆలోచన.
నిజానికి ఒకప్పుడు సౌత్ హీరోలు అంటే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ లో చిన్నచూపు ఉండేది. కానీ, ఇప్పుడు సౌత్ హీరోలకు బాలీవుడ్ హీరోలకు మించి ఆధరణ ఇస్తున్నారు హిందీ ప్రేక్షకులు. అందుకే.. రాబోయే కాలంలో బాలీవుడ్ స్టార్స్ సినిమాలను మించి ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ సినిమాలు ఉంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటికే మన తెలుగు స్టార్స్ నటించిన సినిమాలు హిందీ స్టార్ హీరోల సినిమాలను మించి వసూలు చేస్తున్నాయి కాబట్టి.. ఇప్పట్లో తెలుగు స్టార్ హీరోలకు తిరుగు ఉండకపోవచ్చు. పైగా మనవాళ్ళు తెలుగు సినిమాలు మానుకుని.. హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎలాగూ తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు.
కాబట్టి.. ప్రత్యేకంగా వెళ్లి హిందీ సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు. తెలుగు హీరోలకు ఇదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అదే వేరే బాషల హీరోలు పాన్ ఇండియా సినిమా చేయాలి అంటే.. తమ భాషా చిత్రాల విషయంలో కాంప్రమైజ్ అయ్యి.. కథలో పాన్ ఇండియా ఎలిమెంట్స్ పెట్టాలి. తెలుగు సినిమాకి ఆ అవసరం లేదు. తెలుగు సినిమా కంటెంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కంటంట్ గా రూపాంతరం చెందింది.