IAS Officers: పాలకుల పల్లకి మోసి..వారికి విశేష సేవలందిస్తున్న మన అధికారగణం నెలలో ఒక రోజు విద్యార్థులకు సేవలందించలేరట. తమ వయసు, హోదాను పరిగణలోకి తీసుకొని అటువంటి చిన్న పనులు తాము చేయలేరట. దానిని ఒక నమూషీగా ఫీలవుతున్నారట. కోర్టు ధిక్కరణ కేసులో పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి బీ రాజశేఖర్, అప్పటి కమిషనర్ వీ చినవీరభధ్రుడు, పురపాలకశాఖ ప్రస్తుత ప్రత్యేకప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, పురపాలకశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, పురపాలకశాఖ అప్పటి డైరెక్టర్ జీ విజయ్‌కుమార్, ప్రస్తుత డైరెక్టర్ ఎంఎం నాయక్ ‘సేవా శిక్ష’కు గురైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

ఆ వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు…వాటిని తక్షణం తొలగించాలని 2020 జూన్‌లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఆదేశాలు అమలుకాకపోవడంతో కోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు…వాటిని తక్షణం తొలగించాలని 2020 జూన్‌లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఆదేశాలు అమలుకాకపోవడంతో కోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ఈ వ్యాజ్యాలను విచారించిన కోర్టు.. తన ఆదేశాల అమలులో అధికారులు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారని నిర్ధారించింది.ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు రెండు వారాల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా తొలుత విధించింది. అయితే ఉత్తర్వులను సకాలంలో అమలు చేయనందుకు అధికారులు బేషరతుగా క్షమాపణలు చెప్పడంతోపాటు తమ వయసు, సర్వీసును పరిగణనలోకి తీసుకుని క్షమించాలని కోరారు.
సామాజిక సేవ చేయడానికి అంగీకరిస్తే… మానవతా దృక్పథంతో క్షమిస్తానని కోర్టు అనగా.. అందుకు అధికారులు మౌఖికంగా అంగీకరించారు. దీంతో న్యాయమూర్తి తీర్పును సవరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సామాజిక సేవ చేయాలని, నెలలో ఒక ఆదివారం చొప్పున 12 ఆదివారాలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సమయం కేటాయించాలని ఆదేశించారు. ఆ రోజు మధ్యాహ్నం లేదా రాత్రి విద్యార్థులకు అయ్యే భోజన ఖర్చులను అధికారులే భరించాలని స్పష్టం చేశారు. ఎనిమిది మంది అధికారులకు ఒక్కో జిల్లాను కేటాయించారు.
అయితే ఈ సేవా శిక్షను పున;సమీక్షించాలని కోరుతూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్‌కు నంబరు ఇవ్వడానికి తొలుత రిజిస్ట్రీ నిరాకరించారు. కోర్టు ధిక్కరణ కేసులో వేసిన శిక్షను రివ్యూ చేసే అధికారం తమకు ఉంటుందని, నంబరు ఇవ్వాలని జస్టిస్ బట్టు దేవానంద్ చెప్పడంతో.. రిజిస్ట్రీ నంబరు కేటాయించారు. పిటిషన్‌కు విచారణార్హత ఉందని ఈ సందర్భంగా న్యాయమూర్తి అన్నారు. అనుబంధ పిటిషన్‌కు నెంబరు కేటాయించిన తరువాత తీర్పును పునఃసమీక్షించాలా…లేదా అనే విషయంపై విచారణ జరుపుతామని తెలిపారు. ఈ పిటిషన్ విచారణార్హతపై రిజిస్ట్రీ సందేహం లేవనెత్తారు. నెంబరు ఇచ్చేందుకు నిరాకరించారు.

ఈ నేపధ్యంలో ఈ వ్యవహారం గురువారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించగా, అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ కోర్టుకు సహాయకారిగా వ్యవహరించారు. రివ్యూ పిటిషన్ విచారణార్హత పై తమ వాదనలు వినిపించారు. కోర్టు ధిక్కరణ కేసులో ఖరారు చేసిన శిక్షను రివ్యూ చేసే అధికారం కోర్టుకి ఉందని, అందుకు సంబంధించి ఏపీ, కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పులను అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉదహరించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ…. ‘‘ఎనిమిది మంది ఐఏఎ్‌సలకు శిక్ష విధించినప్పుడు..అందులో ఒకరు వేసిన రివ్యూ పిటిషన్‌ను విచారించవచ్చా? కోర్టు సుమోటాగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో విధించిన శిక్షను పునఃసమీక్షించే అధికారం న్యాయస్థానానికి ఉందా? ఈ రెండు అంశాల పై వాదనలు వినిపించండి’’ అని అడ్వకేట్ జనరల్‌ను న్యాయమూర్తి కోరారు. ఆ విచక్షణాధికారం కోర్టుకు ఉన్నదని అడ్వకేట్ జనరల్ అన్నారు. అధికరణ 215 మేరకు రివ్యూ పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానానికి ఎలాంటి పరిమితులూ లేవన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వై శ్రీలక్ష్మి వేసిన అనుబంధ పిటిషన్‌కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
తమ శిక్ష విషయంలో వెసులబాటు కోసం ఐఏఎస్ అధికారులు కోర్టును ఆశ్రయించడాన్ని తప్పు పట్టలేం కానీ.. బ్యూరోక్రసి వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన వారే ఈ పరిస్థితికి ఎందుకు దిగజారారో ఆత్మవలోకనం చేసుకుంటే మంచిది. గతంలో ప్రభుత్వ పాలనలో కోర్టు తప్పిదాలు ఎత్తిచూపితే ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలున్నాయి. అధికారులు తమ ఉద్యోగాలు పోయిన ఘటనలున్నాయి. కానీ ఇప్పుడు న్యాయస్థానాలంటే లెక్కలేదు. న్యాయమూర్తుల తీర్పునకు భయం లేదు. పైగా శాసనాలు తయారుచేసే తమపై పెత్తనం ఏమిటని న్యాయ వ్యవస్థపైనే ఏకంగా చర్చలు పెట్టేస్తున్నారు. పార్టీలు, నాయకుల అభిమానుల పేరిట సోషల్ మీడియాలోనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అటువంటి వారిని ఐఏఎస్ లు అనుసరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. పాలకులు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు సరిచేయాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారిని అడ్డుకోవాల్సింది పోయి అనుసరిస్తుండడం బాధాకరం.
[…] CM Jagan Sensational Comments: ఏపీ సీఎం జగన్ ప్రస్టేషన్ పీక్ స్టేజుకు వెళ్లిపోయిందా? విపక్షాలు, విపక్ష నేతలపై ఆయన అసహనంతో మాట్లాడుతున్నారా? సహజంగా తాడేపల్లి ప్యాలెస్ విడిచిపెట్టి బయటకు రాని ఆయనకు విక్షలన్నా, ప్రజలన్నా భయమా అంటే.. జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా ‘మారీచ భాష’ మాట్లాడుతున్న సీఎం జగన్ ‘పీకుడు’లోకి వెళ్లిపోయారు. ప్రతిపక్షాలతోపాటు తన తప్పులను వేలెత్తి చూపిస్తున్న మీడియాపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. చివరకు మీకు ‘గుండెపోటు వచ్చి టికెట్ తీసుకుని పోతారు’ అంటూ తనకు వ్యతిరేకంగా ఉన్నవారి మరణాన్ని కోరుకున్నారు. అంతటితో ఆగకుండా ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ వ్యాఖ్యానించారు. నంద్యాలలో వేలాది మంది విద్యార్థలు హాజరైన ‘వసతి దీవెన నిధుల విడుదల’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. […]