https://oktelugu.com/

Raj Tarun: రాజ్ తరుణ్ లో మ్యాటర్ లేదంటూ సంచలన విషయాన్ని బయటపెట్టిన యంగ్ హీరోయిన్..ట్విస్టు మామూలుగా లేదుగా!

రాజ్ తరుణ్ ఒక పెద్ద టాపిక్ అయ్యేలోపు , దానిని క్యాష్ చేసుకుందాం అనే ఉద్దేశ్యంతో ఆయన కొత్త సినిమాల నిర్మాతలు వారం రోజుల వ్యవధిలో 'పురుషోత్తముడు', 'తిరగబడరాస్వామీ' వంటి చిత్రాలను విడుదల చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 19, 2024 / 04:02 PM IST

    Raj Tarun

    Follow us on

    Raj Tarun: గత నెల రోజుల నుండి సోషల్ మీడియా లో రాజ్ తరుణ్ ఒక పెద్ద ట్రెండింగ్ టాపిక్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. లావణ్య అనే అమ్మాయితో గతంలో ఆయన ప్రేమాయణం నడపడం, ఆ తర్వాత ఆమె చేస్తున్న అసాంఘిక కార్యక్రమాలను భరించలేక ఆమె నుండి విడిపోవడం, తర్వాత ఆమె కొన్నాళ్ళకు డ్రగ్స్ కేసు లో రెడ్ హ్యాండెడ్ గా నార్సింగి పోలీసులకు దొరకడం, బయటకి వచ్చిన తర్వాత నాకు నా రాజ్ తరుణ్ కావాలి అంటూ ఆమె గోల చెయ్యడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. రాజ్ తరుణ్ ఒక పెద్ద టాపిక్ అయ్యేలోపు , దానిని క్యాష్ చేసుకుందాం అనే ఉద్దేశ్యంతో ఆయన కొత్త సినిమాల నిర్మాతలు వారం రోజుల వ్యవధిలో ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరాస్వామీ’ వంటి చిత్రాలను విడుదల చేసారు.

    కానీ ఈ రెండు సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. రెండు సినిమాలు కలిపినా కోటి రూపాయిల కలెక్షన్స్ కూడా రాలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన హీరో గా నటించిన ‘భలే ఉన్నాడే’ అనే చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాకి ప్రొమోషన్స్ కోసం మేకర్స్ ఏకంగా రాజ్ తరుణ్ వివాదాన్నే వాడుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంయుక్త రాజ్ తరుణ్ గురించి మాట్లాడుతూ ‘ రాజ్ తరుణ్ గురించి జరుగుతున్న వివాదాన్ని మనమంతా చూస్తూనే ఉన్నాం. మీరంతా ఆ వ్యవహారం గురించి ఏమి అనుకున్నారో నాకు తెలియదు కానీ, నాకు మాత్రం ఈ వివాదాన్ని చూసి నవ్వొచ్చింది. ఎందుకంటే నా స్నేహితురాలు రాజ్ తరుణ్ తో కొన్నాళ్ళు రిలేషన్ లో ఉండేది. అతనితో కలిసి ఉన్నన్ని రోజులు ఆ అమ్మాయి ప్రతిరోజు నాకు కాల్ చేసి ఏడుస్తూ ఉండేది. ఎందుకంటే వీళ్లిద్దరు ఒకే బెడ్ మీద పడుకుంటారట, రాజ్ తరుణ్ మాత్రం ఒక పక్కకి తిరిగి పడుకుంటాడట. ఈ అమ్మాయి అతని దగ్గరకి వెళ్లినా సరే అతను దూరంకి జరిగి పారిపోతాడట. అతనిలో అసలు విషయమే లేదండి. మగాడు కాదు. నేను కూడా లావణ్య కి సంబంధించి ఒక ఆడియో కాల్ ని విన్నాను. ఆ అమ్మాయి వాడిని తీసుకొనిరా, వీడిని తీసుకునిరా అని చెప్తూ ఉంటుంది. ఈ మనిషి పక్కనే ఉన్నాకూడా ఆ అమ్మాయి వేరే అబ్బాయిని కోరుకుంటుంది అంటే అర్థం చేసుకోవాలి కదండీ , అతనిలో మ్యాటర్ లేదని. మనిషి చూసేందుకు బాగానే ఉంటాడు కానీ, అసలు విషయం ఇది. 27 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుంటాను అన్నాడు, ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చాయి, కానీ చేసుకోలేదు. ఇంకో పదేళ్ల తర్వాత కూడా చేసుకోడు, ఎందుకంటే అతనిలో మ్యాటర్ లేదు కదా. త్వరలోనే నా స్నేహితురాలు ఇండియా కి వస్తుంది. ఆరోజు నేను ఆధారాలతో సహా బయట పెడతాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన హీరో గా నటిస్తున్న ‘భలే ఉన్నాడే’ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి ప్రొమోషన్స్ చేసారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.