https://oktelugu.com/

Chhava Teaser: వెన్నుపోటు లో కట్టప్పనే మించిపోయిన రష్మిక..’పుష్ప’ విషయంలో ఇంత మోసమా!

పూర్తి వివరాల్లోకి వెళ్తే రష్మిక బాలీవుడ్ లో విష్ణు కౌశల్ (కత్రినా కైఫ్ భర్త) తో కలిసి 'చావా' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరోచిత జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 19, 2024 / 04:09 PM IST

    Chhava Teaser

    Follow us on

    Chhava Teaser: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప : ది రూల్’ కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంత ఆత్రుతతో ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. ‘పుష్ప’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ‘పుష్ప : ది రూల్’ పై ఈ స్థాయిల అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలకు, టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఆగష్టు 15 న గ్రాండ్ గా విడుదల అవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో డిసెంబర్ 6 వ తేదికి వాయిదా వేశారు. పుష్ప కి ఇక అడ్డు లేదు, వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అవలీల గా దాటేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మికానే పుష్ప కి సమస్య అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే రష్మిక బాలీవుడ్ లో విష్ణు కౌశల్ (కత్రినా కైఫ్ భర్త) తో కలిసి ‘చావా’ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరోచిత జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని నేడు కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ టీజర్ లో డిసెంబర్ 6 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఒక చారిత్రాత్మక చిత్రం , ఆమె హీరోయిన్ నటిస్తున్న పుష్ప చిత్రానికి పోటీ వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇందులో ఆమె పొరపాటు ఏమి లేదు, అది నిర్మాతల ఇష్టం కానీ, సోషల్ మీడియా లో మాత్రం అల్లు అర్జున్ అభిమానులు నీ సినిమాకి నువ్వే వెన్నుపోటు పొడుస్తావా?, కట్టప్పనే మించిపోయావుగా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పుష్ప చిత్రానికి ఎదురు వచ్చేంత సాహసమా..?, చాలా రిస్క్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ‘చావా’ మూవీ టీం కి వార్నింగ్ ఇస్తున్నారు. వాస్తవానికి మామూలు చిత్రం అయ్యుంటే నిజంగా పుష్ప దాటికి తట్టుకోలేకపోవచ్చు. కానీ ‘చావా’ అనే చిత్రం ఛత్రపతి శివాజీ కొడుకుకి సంబంధించిన స్టోరీ తో తెరకెక్కిన సినిమా.

    నార్త్ ఇండియాలో ఛత్రపతి శివాజీని దేవుడిలాగా కొలుస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శివాజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన అజయ్ దేవగన్ ‘తానాజీ’ చిత్రం ఇక్కడ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, 450 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అందులో 70 శాతం వసూళ్లు మహారాష్ట్ర ప్రాంతం నుండి వచ్చినవే, దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు పుష్ప సినిమాకి ‘చావా’ హిట్ అయితే కలెక్షన్స్ పై చాలా ప్రభావం చూపుతుందని. చూడాలి మరి ఏమి జరగబోతుందో, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే, పుష్ప షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉంది. డిసెంబర్ 6 నాటికి పూర్తి అయ్యి విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు.