https://oktelugu.com/

Yash- Ravi Teja: యశ్, రవితేజ అభిమానుల మధ్య మాటల యుద్ధం.. అసలు ఎందుకు ఈ గొడవ?

తాజాగా రవితేజ పాన్ ఇండియా స్థాయిలో సినిమాను చేసిన సంగతి తెలిసిందే. అదేనండి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో అన్ని భాషల్లో అన్ని భాషల్లో అలరించడానికి సిద్దమయ్యారు మాస్ హీరో.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 11, 2023 / 04:17 PM IST
    Yash- Ravi Teja

    Yash- Ravi Teja

    Follow us on

    Yash- Ravi Teja: తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా కొన్ని మాటలు మాత్రం ఫ్యాన్స్ ను భారీగా హట్ చేస్తుంటాయి. ఎలాంటి ఉద్దేశ్యం లేకుండా చేసినా కొన్ని వ్యాఖ్యలకు నానార్థాలు తీసి మరీ ట్రోల్స్ చేస్తుంటారు అభిమానులు. అంతే కాదు వారి పాత విషయాలు తవ్వి మరీ తిట్టిపోస్తుంటారు. అందుకే సెలబ్రెటీలు ఏది మాట్లాడాలన్నా కూడా ఆచితూచి ముందు వెనక ఆలోచించి మాట్లాడుతుంటారు. లేదంటే ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవకతప్పదు. ఇప్పుడు ఇలాంటి సందర్భమే మాస్ మహారాజా రవితేజకు వచ్చి పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

    తాజాగా రవితేజ పాన్ ఇండియా స్థాయిలో సినిమాను చేసిన సంగతి తెలిసిందే. అదేనండి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో అన్ని భాషల్లో అన్ని భాషల్లో అలరించడానికి సిద్దమయ్యారు మాస్ హీరో. హిందీలో అయితే ఈ సినిమా కోసం పెద్ద ప్లానే చేశారట. ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నట్టు సమాచారం. ఎప్పుడు రవితేజ డబ్బింగ్ సినిమాలను టీవీల్లో, లేదా యూట్యూబ్ లో మాత్రమే చూస్తుంటారు అభిమానులు. కానీ మాస్ మహారాజా థియేటర్లలో ఎలా దుమ్ములేపుతారో ఇప్పటికీ చూడలేకపోయారు హిందీ ఆడియన్స్. అందుకే బాలీవుడ్ లో కూడా ఎంటర్టైన్ చేయడం కోసం థియేటర్లలో రవితేజ రానుండడంతో ఈ సినిమాకు అక్కడ ఆదరణ ఎలా ఉంటుందో అని రవితేజ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

    ఇక ఈ సినిమా కోసం రవితేజనే అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. అందులోని విజువల్స్, డైలాగ్స్, మేకింగ్ కూడా నచ్చేశాయి అంటూ కామెంట్లు పెట్టారు అభిమానులు. దీంతో సినిమాకు కావాల్సిన హైప్ కూడా వచ్చేసింది. అయితే ప్రమోషన్ లో భాగంగా రవితేజ ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు యశ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయట.

    రామ్ చరణ్, విజయ్, రాజమౌళి, ప్రభాస్, యశ్ గురించి రవితేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.. రామ్ చరణ్, విజయ్‌లో డ్యాన్స్ అంటే ఇష్టమని, ప్రభాస్ నిజంగానే డార్లింగ్ అని, రాజమౌళి అంటే విజన్ అని చెప్పుకొచ్చాడు రవితేజ. ఆ తర్వాత యశ్ గురించి ప్రశ్న ఎదురైనప్పుడు కేజీయఫ్ లాంటి సినిమా దొరకడం యశ్ కి అదృష్టమని, కేజీయఫ్ తప్ప ఇంకే చిత్రం కూడా చూడలేదని చెప్పాడు రవితేజ. ఈ చిన్న వాక్యానికి యశ్ ఫ్యాన్స్ భారీగా హట్ అయ్యారట.

    యశ్‌కు కేజీయఫ్ దొరకడం లక్కీనా? అసలు నువ్వు యశ్ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు యశ్ ఫ్యాన్స్. అంతే కాకుండా రవితేజ తన కెరీర్ ప్రారంభంలో కన్నడ చిత్రంలో సైడ్ యాక్టర్‌గా నటించాడట. ఆ విజువల్స్ మళ్లీ నెట్టింట్లోకి తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు. ఇలా సైడ్ పాత్రను కన్నడ చిత్రంలో చేసేందుకు చాన్స్ రావడం నీ లక్కీ అంటూ వేలెత్తి చూపిస్తున్నారు. మొత్తానికి యశ్ ఫ్యాన్స్ మాత్రం నెట్టింట్లో నానా హంగామా చేస్తున్నారు. రవితేజ లైటర్ వే లో అన్న మాటలను సీరియస్‌గా తీసుకుని ఇలా ట్రోల్ చేస్తున్నారు.. యశ్ కింది స్థాయి నుంచి వచ్చాడు.. రవితేజ కూడా కింది స్థాయి నుంచి వచ్చి ఈ రేంజ్‌కు ఎదిగాడు.. రవితేజ సీనియర్ యాక్టర్.. ఆయన ఎలాంటి ఇంటెన్షన్ తో అనలేదు అంటూ రవితేజ ఫ్యాన్స్ నచ్చజెబుతున్నారు.