Most Peaceful Country: ప్రపంచంలో ప్రశాంతమైన దేశం ఏదో తెలుసా?

2023లో ప్రపంచంలో అత్యంత శాంతియుతమైన దేశంగా ఐస్‌లాండ్‌ గుర్తింపు పొందింది. ఇది 2008 నుంచి ఇదే స్థానంలో కొనసాగుతోంది. డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియాలు కూడా అత్యంత శాంతియుత దేశాల జాబితాలో ఉన్నాయి.

Written By: Raj Shekar, Updated On : October 11, 2023 4:09 pm

Most Peaceful Country

Follow us on

Most Peaceful Country: ఒకవైపు ప్రపంచ అగ్రదేశాలు ఆధిపత్యం కోసం పరోక్ష యుద్ధాలను ప్రోత్సహిస్తుంటే.. మరోవైపు చిన్న దేశాలు.. ఉగ్రవాద సంస్థల దాడులతో ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కొన్ని తమ ఆధిపత్యం కోసం ఉగ్రవాద సంస్థలను వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నాయి. దీంతో అవి మరింత రెచ్చిపోతున్నాయి. తాజాగా, అక్టోబర్‌ 7 ఉదయం.. ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థల్లో ఒకటైన హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడికి దిగినవార్త హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఇజ్రాయెల్‌పై ఏకకాలంలో వేలాది క్షిపణులను హమాస్‌ ప్రయోగించింది. అక్కడి ప్రజలు ముందురోజు రాత్రిపూట ఎంత ప్రశాంతంగా నిద్రించారో.. మరుసటి రోజు నాటికి విగతజీవులుగా ఎలా మారారో తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రపంచంలో శాంతి కరువైపోతున్నదనే భావన అందరిలో కలుగుతుంది. ఏ దేశంలో ఎప్పుడు దాడి జరగవచ్చో అనే ఆందోళన అందరినీ పట్టిపీడిస్తుంది. ఈ ప్రశ్నకు తగిన సమాధానం ఎవరూ చెప్పలేకపోయినా, ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన దేశం గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు.

ప్రశాంతతలో నంబర్‌ వన్‌..
2023లో ప్రపంచంలో అత్యంత శాంతియుతమైన దేశంగా ఐస్‌లాండ్‌ గుర్తింపు పొందింది. ఇది 2008 నుంచి ఇదే స్థానంలో కొనసాగుతోంది. డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియాలు కూడా అత్యంత శాంతియుత దేశాల జాబితాలో ఉన్నాయి. 2023లో ప్రపంచంలో అత్యల్ప శాంతియుత దేశంగా ఆఫ్ఘనిస్తాన్‌ నిలిచింది. వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా ఆఫ్ఘనిస్తాన్‌ ఇదే స్థానంలో ఉంది. యెమెన్, సిరియా, సౌత్‌ సూడాన్, డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోతోపాటు మరో నాలుగు తక్కువ శాంతియుత దేశాల జాబితాలో చేరాయి.

భారత్‌ స్థానం 126..
అత్యధిక జనాభా కలిగిన భారత దేశం 2023 గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌(జీపీటీ)లో 126వ అత్యంత శాంతియుత దేశంగా ఉంది. హింసాత్మక నేరాలు తగ్గుముఖం, పొరుగు దేశాలతో సంబంధాలు, రాజకీయ అస్థిరత కారణంగా గత ఏడాది దేశంలో శాంతి 3.5 శాతం మెరుగుపడింది. చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కూడా తగ్గింది. సరిహద్దు సంఘటనల తగ్గుదల కారణంగా చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, అలాగే సాధారణంగా తక్కువ సామాజిక అశాంతి, భారతదేశంలో రాజకీయ అస్థిరత సూచికలో మెరుగుదలకు దారితీసింది. ఇతర దేశాలలో, నేపాల్‌ , చైనా, శ్రీలంక, యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా మరియు పాకిస్తాన్‌ వరుసగా 79, 80, 107, 131, 146 స్థానాల్లో ఉన్నాయి.

ఐస్‌లాండ్‌కే ఎందుకు..
ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌ ద్వారా అందించబడిన జీపీఐ 17వ ఎడిషన్‌ 163 స్వతంత్ర రాష్ట్రాలు మరియు భూభాగాలను శాంతియుత స్థాయికి అనుగుణంగా ర్యాంక్‌ ఇచ్చింది . ఈ నివేదిక శాంతి ధోరణులు, దాని ఆర్థిక విలువ మరియు శాంతియుత సమాజాలను ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపై ఇప్పటి వరకు అత్యంత సమగ్రమైన డేటా–ఆధారిత విశ్లేషణను అందజేస్తుంది అని నివేదిక పేర్కొంది. ఐస్‌లాండ్‌కు సరిహద్దు దేశాలతో విభేదాలు లేవు. చిన్న దేశం, అభివృద్ధి చెందిన దేశం కావడంతో భద్రత పరంగా పటిష్టంగా ఉంది. అందుకే ఐస్‌లాండ్‌ 2008 నుంచి శాంతి దేశాల్లో మొదటి స్థానంలో నిలుస్తుంది.