Bahubali The Epic Viral Video: ఒక స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ అయ్యిందంటే అభిమానుల కోలాహాలం థియేటర్స్ వద్ద ఈమధ్య కాలం లో ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటుంది. తమ అభిమాన హీరోలకు సంబంధించిన కొత్త సినిమాలు విడుదలైతే ఎలాంటి హంగామా చేస్తారో,రీ రిలీజ్ సినిమాలకు కూడా అదే రేంజ్ హంగామా చేస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ సినిమాలతో మొదలైన ఈ ట్రెండ్, ఇప్పుడు ఇండియా మొత్తం పాకింది. రికార్డ్స్ కూడా ఆ ఇద్దరి హీరోల మధ్యనే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రభాస్(Rebel Star Prabhas) ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali: The Epic) చిత్రం తో ఆల్ టైం ఇండియన్ రికార్డు ని నెలకొల్పబోతున్నాడు. దీనిని అందుకోవడం పవన్,మహేష్ లకు కష్టమే. ఎందుకంటే కేవలం తెలుగు లో మాత్రమే కాదు,హిందీ, తమిళం, మరియు ఇతర భాషల్లో కూడా ‘బాహుబలి : ది ఎపిక్’ మంచి ఓపెనింగ్స్ ని నమోదు చేసుకుంటుంది.
ఇదంతా పక్కన పెడితే నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యినప్పటికీ, ప్రీమియర్ షోస్ మాత్రం గత రెండు రోజులుగా అన్ని ప్రాంతాల్లో పడుతూనే ఉన్నాయి. ఓవర్సీస్ లో అయితే కొత్త సినిమాలకు కూడా ఈ సినిమాకు వచ్చినంత గ్రాస్ రాదు అనొచ్చు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో అభిమానులు థియేటర్స్ లో చేసిన హంగామా కి సంబంధించిన వీడియోలు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. అందులో ఒక వీడియో ఇప్పుడు నెటిజెన్స్ చేత నవ్వులు పూయిస్తోంది. బాహుబలి చిత్రం లో శివగామి నదిలో మునిగిపోతూ బిడ్డని తన చేతితో పైకి లేపే సన్నివేశం ఒకటి ఉంటుంది గుర్తుందా?, ఈ షాట్ ని ప్రభాస్ అభిన్నులు థియేటర్స్ లో రీ క్రియేట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చిన్న బిడ్డతో ఈ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేసుంటే అంత కామెడీ వచ్చేది కాదేమో కానీ, పది మంది అభిమానులు కలిసి ఒక అభిమానిని పైకి లేపడమే కామెడీ గా అనిపించింది.
సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని క్రింద అందిస్తున్నాము చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే బుక్ మై షో లో బాహుబలి చిత్రానికి గంటకు 8 నుండి పది వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఒక్క బుక్ మై షో యాప్ లోనే ఈ రేంజ్ లో ఉందంటే, డిస్ట్రిక్ట్ యాప్ లో అమ్ముడుపోయే టికెట్స్ ని కూడా కలుపుకొని చూస్తే,నాని,విజయ్ దేవరకొండ రేంజ్ హీరోల కొత్త సినిమాలకంటే ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోతున్నాయి అనుకోవచ్చు. చూడాలి మరి ఇదే రేంజ్ జోరు ని ఎన్ని రోజులు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగిస్తుంది అనేది.
#BaahubaliTheEpic pic.twitter.com/3akjmYNtol
— • (@PrasadShettty) October 31, 2025