https://oktelugu.com/

Anasuya Bharadwaj: అనసూయపై ఆ డైరెక్టర్ ఏం కామెంట్లు చేశాడు?

Anasuya Bharadwaj: జబర్దస్త్ షో తో పాపులర్ అయిన యాంకర్ అనసూయ. తన అందంతో పాటు మాటలతో జబర్దస్త్ కు దాదాపు తొమ్మిదేళ్లు సేవలు అందించింది. దీంతో తనకూ కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు ఆ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం జబర్దస్తే అని మరిచిపోవద్దు. కన్నతల్లి లాంటి జబర్దస్త్ ను ప్రస్తుతం వదిలేసింది. ఇక స్టార్ మాలో తన హవా కొనసాగిస్తోంది. జబర్దస్త్ ను వీడటానికి కారణాలు ఏవైనా వెళ్లిపోవడం మాత్రం కరెక్టు కాదనే […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 16, 2022 / 08:38 AM IST
    Follow us on

    Anasuya Bharadwaj: జబర్దస్త్ షో తో పాపులర్ అయిన యాంకర్ అనసూయ. తన అందంతో పాటు మాటలతో జబర్దస్త్ కు దాదాపు తొమ్మిదేళ్లు సేవలు అందించింది. దీంతో తనకూ కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు ఆ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం జబర్దస్తే అని మరిచిపోవద్దు. కన్నతల్లి లాంటి జబర్దస్త్ ను ప్రస్తుతం వదిలేసింది. ఇక స్టార్ మాలో తన హవా కొనసాగిస్తోంది. జబర్దస్త్ ను వీడటానికి కారణాలు ఏవైనా వెళ్లిపోవడం మాత్రం కరెక్టు కాదనే వాదనలు కూడా వచ్చాయి. వెళ్లిపోయే సమయంలో కనీసం కంట కన్నీరు కార్చని అనసూయపై సెటైర్లు కూడా వేశారు. ఎంతో కాలం జబర్దస్త్ తో కలిసి ఉన్నా విడిపోయే సమయంలో కంట కన్నీరు కార్చకపోవడం నెటిజన్లను తెగ బాధించేసింది. దీనిపై జబర్దస్త్ టీం లీడర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.

    Anasuya Bharadwaj

    బుల్లితెరలో తన సత్తా చాటుతూనే వెండితెరలో కూడా కర్చీఫ్ వేసుకుంది. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి అందరిని మెప్పించింది. ఇక పుష్ప సినిమాలో దక్షాయణిగా నటించి అందరి మనసు చూరగొంది. కృష్ణవంశీ తీసే రంగమార్తాండ సినిమాలో కూడా ఓ పాపులర్ క్యారెక్టర్ చేస్తుందని సమాచారం. ఇక పుష్ప 2లో కూడా మళ్లీ ఓ మంచి పాత్రతో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక దర్జా సినిమాలో లేడీ ఓరియంటెడ్ గా నటించి ప్రేక్షకులను ముగ్దులను చేయనుంది. దీనిపై కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి. అనసూయ వెండితెరను కూడా ఏలుతోందని చెబుతున్నారు.

    Also Read: NTR- Prasanth Neel: ‘ప్రశాంత్‌ నీల్‌ – ఎన్టీఆర్’ ‌సినిమా కథ ఇదే.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. ఇక సంచలన అంచనాలే !

    అనసూయ వాంటెడ్ పండుగాడ్ సినిమాలో కూడా ఓ రోల్ పోషించింది. దీంతో ఈ సినిమా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు హరీష్ శంకర్ అనసూయపై హాట్ కామెంట్లు చేయడం వైరల్ అవుతోంది. అనసూయ అందానికి అసూయ పుట్టించేలా ఉందని రోజురోజుకు తన గ్లామర్ పెరుగుతోందని చెప్పడం గమనార్హం. దీంతో ప్రస్తుతం ఆమెకి సంబంధించిన కామెంట్లు సంచలనం కలిగిస్తున్నాయి. అనసూయ అందంపై హరీష్ శంకర్ కామెంట్లతో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

    Anasuya Bharadwaj

    అనసూయ వయసుతో పాటు అందం కూడా పెరుగుతోందని కామెంట్ చేశాడు. ఈ విషయం తనకు నటుడు తనికెళ్ల భరణి చెప్పారని కూడా చెప్పేశాడు. దీంతో హరీష్ శంకర్ కామెంట్లపై నెటిజన్లు స్పందిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుపై ఇంతలా కామెంట్లు చేయడం సంచలనం సృష్టిస్తోంది. మొత్తానికి అనసూయ అందం అందరిని ఆకట్టుకుంటోంది. వయసుతో పాటు సొగసు పెరగడం ఆమెకు ప్లస్ అవుతోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు నెట్లో పెడుతూ ఆమె కూడా ప్రేక్షకులతో సందడిగా గడపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ మాటలు ఏం ఊరికే రాలేదనే తెలుస్తోంది. ఆమె అందానికి ఫిదా కాని వారు ఎవరున్నారో చెప్పండి.

    Also Read:Emmanuel- Varsha: వర్ష నిజస్వరూపం బయటపెట్టిన ఇమాన్యుయేల్.. నిజంగా వర్ష అంత పని చేసిందా ?

    Tags