https://oktelugu.com/

NTR: ఎన్టీయార్ కి కథలు చెబుతున్న ఇద్దరు తమిళ్ స్టార్ డైరెక్టర్లు…మరి వర్కౌట్ అయిందా..?

ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకట్టైపోయింది. అందుకే హీరోలందరితో అన్ని లాంగ్వేజ్ ల్లో ఉన్న దర్శకులు సినిమాలను చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సినిమా పరిధి అనేది కూడా దాటిపోయింది. కాబట్టి సినిమా ఇండస్ట్రీలన్నింటిని కలిపి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గా గుర్తిస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 4, 2024 / 03:48 PM IST

    NTR(6)

    Follow us on

    NTR: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్కరు అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సాగుతున్నారు. మణిరత్నం, శంకర్ లాంటి డైరెక్టర్లు లెజెండరీ డైరెక్టర్లుగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్లు మాత్రం కొత్త స్టైల్ లో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనే దాని మీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక అట్లీ పాన్ ఇండియా లో మంచి డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. షారుక్ ఖాన్ తో చేసిన జవాన్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయింది. దాంతో ఆయన ఇప్పుడు బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ తో ఒక ప్రాజెక్టు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి మరోసారి పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

    ఇక ఏది ఏమైనప్పటికీ ఆయన చేస్తున్న ఈ ప్రయోగం మాత్రం సూపర్ సక్సెస్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి యాక్టర్ గా పేరుపొందిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కూడా నెంబర్ వన్ నటుడిగా ముందుకు దూసుకెళ్తున్నాడు.

    రీసెంట్ గా రిలీజ్ అయిన దేవర సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇక మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయనకు ఇండియా వైడ్ గా భారీ మార్కెట్ క్రియేట్ అవ్వడంతో తమిళ్ సినిమా దర్శకులు ఎన్టీఆర్ మీద కర్చిఫ్ వేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే అట్లీ, లోకేష్ కనకరాజు ఇద్దరు ఎన్టీఆర్ కి కథలు వినిపించారట. మరి ఎన్టీఆర్ వాటి మీద ఎలాంటి స్పందనను తెలియజేయనప్పటికీ ప్రస్తుతం ఆయన చేస్తున్న వార్ 2, ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అట్లీ, లోకేష్ కనకరాజ్ ఇద్దరిలో ఎవరిదో ఒకరి ప్రాజెక్టు ఓకే చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాని ఎప్పుడు తెరకెక్కిస్తారు అనేది తెలియాల్సి ఉంది. కానీ ముందుగా ఈ దర్శకులలో ఎవరిని ఫైనల్ చేయబోతున్నాడనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది…