టాలీవుడ్ డ్రగ్స్ కేసు కనుమరుగైనట్టేనా?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత చిత్రసీమలోని చీకటికోణాలు మరోసారి వెలుగు చూస్తున్నాయి. సినీ సెలబ్రెటీలకు మాఫియాతో సంబంధాలు.. డ్రగ్స్ లింకులు ఉన్నట్లు గతంలోనే తేలడంతో పలువురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కొన్నేళ్లుగా వీటికి దూరంగా ఉంటున్న కన్పించిన చిత్రసీమలో మళ్లీ డ్రగ్స్ లింకులు బయటపడటం అందరికీ కలవరానికి గురిచేసింది. Also Read: నమ్రతను నేను గౌరవిస్తా..: బండ్ల గణేశ్‌ కామెంట్స్‌ సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో ప్రస్తుతం బాలీవుడ్లో ఆందోళన […]

Written By: NARESH, Updated On : September 23, 2020 11:50 am

Tollywood drug case

Follow us on

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత చిత్రసీమలోని చీకటికోణాలు మరోసారి వెలుగు చూస్తున్నాయి. సినీ సెలబ్రెటీలకు మాఫియాతో సంబంధాలు.. డ్రగ్స్ లింకులు ఉన్నట్లు గతంలోనే తేలడంతో పలువురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కొన్నేళ్లుగా వీటికి దూరంగా ఉంటున్న కన్పించిన చిత్రసీమలో మళ్లీ డ్రగ్స్ లింకులు బయటపడటం అందరికీ కలవరానికి గురిచేసింది.

Also Read: నమ్రతను నేను గౌరవిస్తా..: బండ్ల గణేశ్‌ కామెంట్స్‌

సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో ప్రస్తుతం బాలీవుడ్లో ఆందోళన మొదలైంది. పలువురు సెలబ్రెటీలకు ఇప్పటికే నోటీసులు పంపించి విచారణకు రావాలని ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. ఆమెతోపాటు రాగిణి ద్వివేది, సంజానా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్లు కూడా డ్రగ్స్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మరో 25మంది సెలబ్రెటీలు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

బాలీవుడ్లో ఇప్పుడు జరుగుతున్నట్లుగానే మూడేళ్ల క్రితం టాలీవుడ్లో డ్రగ్స్ లింకులు బయటపడ్డాయి. 2017లో సికింద్రాబాద్ కు చెందిన కెల్విన్ మాస్కెరాన్స్, చంద్రాయణగుట్ట ఇస్మాయిన్ నగర్ కు చెందిన ఎండీ అబ్దూల్ వహాబ్, ఎండీ అబ్దుల్ ఖుద్దూస్ లను పోలీసులు అరెస్టు చేశారు. వీరు అత్యంత ఖరీదైన డ్రగ్స్ అమ్ముతుండగా పక్కా సమాచారంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో అప్పట్లో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి.

వీరంతా పాఠశాల విద్యార్థుల నుంచి టాలీవుడ్లోని ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. దీంతో ఈ కేసు అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. టాలీవుడ్లోని ప్రముఖులకు డ్రగ్స్ లింకులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్న తరుణంలో రాజకీయ, సినీ ప్రముఖులు వారిపై ఒత్తిడి తేవడంతో ఈ కేసు నెమ్మదిగా నీరుగారిపోయింది. దాదాపు మూడేళ్లు గడుస్తున్న ఈ కేసులో ఇప్పటికీ ఎలాంటి పురోగతి కన్పించకపోవడంతో టాలీవుడ్ డ్రగ్స్ కేసు నీరుగారినట్టేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Also Read: నా బయోపిక్ కు నేనే డైరెక్టర్ ను

అయితే బాలీవుడ్లో డ్రగ్స్ కేసు నేపథ్యంలో టాలీవుడ్ కు లింకులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నారు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా బాలీవుడ్ డ్రగ్స్ కేసు టాలీవుడ్ కు చుట్టూ తిరుగుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి తలపిస్తున్న డ్రగ్స్ కేసు ఇంకేన్ని ట్వీస్టులు ఇస్తుందో వేచి చూడాల్సిందే..!